S Jaishankar: కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్’ చిత్రంపై పాకిస్తాన్ ప్రేలాపనను తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్. దీనిపై పాకిస్తాన్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. అవిభాజ్య భారతదేశం చిత్రాన్ని, అశోక సామ్రాజ్యాన్ని, బాధ్యతయుతమైన, ప్రజా ఆధారిత పాలనను ఇది చూపుతుందని, అర్థం చేసుకునే శక్తి పాకిస్తాన్ కు లేదని అందుకే దాన్ని అర్థం చేసుకోలేకపోతోందని విమర్శించారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) గురించి జైశంకర్ మాట్లాడుతూ..మేము మా వైఖరిపై స్పష్టంగా ఉన్నామని, ఇది ఒక్క బీజేపీ వైఖరే కాదని, దేశం, పార్లమెంట్ కూడా పీఓకే భారత్ లో అంతర్భాగం అని చెబుతున్నారని తెలిపారు. మే 28న ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవనంలో పురాతన భారతదేశ మ్యాప్‌ను చూపించే కుడ్యచిత్రం ఉంది. ఆనాటి కాలంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థగా విరాజిల్లిన తక్షశిల(ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది)ను కూడా అఖండ భారతంలోనే భాగంగా ఉండేది. అయితే పాకిస్తాన్ తో పాటు నేపాల్, బంగ్లాదేశ్ కూడా ఈ చిత్ర పటంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Read Also: Bihar: వంతెన స్లాబ్, పిల్లర్ మధ్య చిక్కుకున్న బాలుడు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
ప్రధాని మోడీ, అధికార బీజేపీపై అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జైశంకర్ మండిపడ్డారు. వాస్తవాలపై సరైన అవగాహన లేకుండా రాహుల్ గాంధీ ఎక్కువగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీకి విదేశాల్లో భారతదేశాన్ని విమర్శించే అలవాటు ఉందని జైశంకర్ అన్నారు.
పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన అఖండ భారత చిత్రంపై పాకిస్తాన్ తో పాటు నేపాల్, బంగ్లాదేశ్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఇటీవల భారత పర్యటకు వచ్చిన నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ని ఈ సమస్యని భారత్ లో లేవనెత్తాలని పలువురు నేపాల్ నాయకులు కోరారు. నేపాల్ మాజీ ప్రధాని బాబూరా ఎం భట్టారాయ్ మాట్లాడుతూ, “కొత్త పార్లమెంటు భవనంలోని అఖండ భారత్ కుడ్యచిత్రం వివాదాస్పదమైనది, ఇది పొరుగు దేశాలతో దౌత్యవ్యూహాలకు హానికరం అని అన్నారు. గత వారం, పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముంతా జె. జెహ్రా బలోచ్ కొత్త పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన గోడపై ఆందోళన వ్యక్తం చేశారు.