NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్‌కి మోడీ లాంటి నాయకుడు కావాలి.. పాక్ వ్యాపారవేత్త ప్రశంసలు..

Sajid Tarar

Sajid Tarar

Pakistan: పాకిస్తాన్‌కి ప్రధాని నరేంద్రమోడీ లాంటి నాయకుడు కావాలని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ వ్యాఖ్యానించారు. మోడీ మూడోసారి కూడా గెలుస్తారని జోస్యం చెప్పారు. పాకిస్తాన్-భారత్‌తో చర్చలు ప్రారంభించి వాణిజ్యం ప్రారంభించాలని సూచించారు. భారతదేశాన్ని ప్రధాని మోడీ కొత్త శిఖరాలకు తీసుకెళ్లాడని, ఆయన బలమైన నేత అని తరార్ కొనియాడారు. సాజిద్ తరార్ మాట్లాడుతూ.. మోడీ భారతదేశానికి మాత్రమే కాదు, ఈ ప్రాంతానికి, ప్రపంచానికి చాలా మంచివాడు. పాకిస్తాన్‌కి కూడా అతనిలాంటి నాయకుడు వస్తాడని ఆశిస్తున్నానని అన్నారు. భారత్ యువజనాభా నుంచి లాభం పొందుతుందని చెప్పారు.

Read Also: Jharkhand: రూ. 37 కోట్లు పట్టుబడిన కేసులో మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం అరెస్ట్..

‘‘ మోడీ గొప్పనాయకుడు. ఆయన సహజ నాయకుడు, ప్రతికూల పరిస్థితుల్లో పాకిస్తాన్‌లో పర్యటించి, తన రాజకీయాలను పణంగా పెట్టిన ఏకైక ప్రధాని ఆయనే. మోడీజీ పాకిస్తాన్‌తో చర్చలు, వాణిజ్యం ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను’’ అని తరార్ చెప్పారు. శాంతియుత పాకిస్తాన్ భారత్‌కి కూడా మంచిదని, భారతదేశ తదుపరి ప్రధాని మోడీనే అని అన్నారు. తరార్ 1990లో యూఎస్ వెళ్లి వ్యాపారంలో స్థిరపడ్డారు.

‘‘భారత్‌లో 97 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం ఒక అద్భుతం తప్ప మరోటి కాదు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. నేను అక్కడ మోడీజీకి ఉన్న ప్రజాదరణ చూస్తున్నా. 2024లో భారత్ ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. భారత ప్రజాస్వామ్యం నుంచి భవిష్యత్తులో ప్రజలు నేర్చుకుంటారు’’ అని తరార్ అన్నారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, దీని ఫలితంగా పీఓకే తో సహా దేశంలోని అనేక ప్రాంతాలు సామాజిక అశాంతిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. పాక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది, ద్రవ్యోల్భణం ఎక్కువగా ఉందని, పెట్రోల్ ధరలు పెరిగాయి, పన్నులు పెంచాలని ఐఎంఎఫ్ కోరుతోంది, కరెంట్ ఖర్చులు పెరిగాయి, మేము ఎగుమతి చేయలేకపోతున్నామని తరార్ అన్నారు. విద్యుత్ బిల్లుల కారణంగా పాక్ ఆక్రమిత్ కాశ్మీర్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.

Show comments