Site icon NTV Telugu

Congress: పహల్గామ్ ఉగ్రదాడి.. బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..

Congress

Congress

Congress: జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో టూరిస్టుల్ని టార్గెట్ చేస్తూ, ఉగ్రవాదులు దారణమైన దాడికి పాల్పడ్డారు. పక్కా పథకంలో వచ్చిన టెర్రరిస్టులు, అమాయకులైన పర్యాటకుల ప్రాణాలు తీశారు. మంగళవారం జరిగిన ఈ దాడిలో 27 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ దాడికి సంబంధించి ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. అత్యున్నత సమావేశం కోసం అమిత్ షా హుటాహుటిన శ్రీనగర్ వెళ్లారు.

Read Also: Health Tips: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే చాలు.. ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు

ఇదిలా ఉంటే, ఈ దాడిపై కాంగ్రెస్ నేత, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించామని, సాధారణ పరిస్థితిని పునరుద్ధరించామని ‘‘ఖాళీ వాదనలు’’ చేయడానికి బదులుగా కేంద్రం బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పర్యాటకులపై దాడి హృదయ విదారకంగా ఉందని అన్నారు. ‘‘జమ్మూ కాశ్మీర్‌లో ఖాళీ వాదనలు చేయడానికి బదులుగా, ప్రభుత్వం జవాబుదారీతనం వహించి, భవిష్యత్తులో ఇలాంటి అనాగరిక సంఘటనలు జరగకుండా, అమాయక భారతీయులు ఇలా ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందిస్తూ, ఇది మానవత్వంపై మచ్చగా అభివర్ణించారు. ఉగ్రవాదులపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని అధికార బీజేపీని కోరారు .”దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి, దానిని తీవ్రంగా ఖండిస్తుంది” అని ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టామని గతంలో చెప్పిన బీజేపీ, ఇప్పుడు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

Exit mobile version