Asaduddin Owaisi: మతం ఆధారంగా కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీలు ఓట్లు అడుగుతున్నాయని మండిపడ్డారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసద్దుదీన్ ఓవైసీ. హుబ్లీలో కూల్చివేసిన దర్గా పునర్మిర్మానికి కాంగ్రెస్ హామీ ఇస్తుందా..? అని ప్రశ్నించారు. బీజేపీతో సైద్ధాంతిక పోరాటానికి లొంగిపోయిందని అన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలత్లో హనుమాన్ ఆలయాల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం ప్రకటించిన నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: KTR: హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కేటీఆర్ పర్యటన..17 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఓటు వేసేటప్పుడు ‘జై బజరంగబలి’ అని చెప్పాలని కర్ణాటక ప్రజలను ప్రధాని మోదీ కోరారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో మరిన్ని హనుమాన్ ఆలయాలు నిర్మిస్తామని డీకే శివకుమార్ చెబుతున్నారని, ఇది ఎలాంటి సెక్యులరిజం? అని ఓవైసీ ప్రశ్నించారు. మే 10న ప్రజలు ఓటు వేసేటప్పుడు ‘అల్లాహు అఖ్బర్’ అని చెప్పమని నేను ఇక్కడ నిలబడి అడిగితే, మీడియా నన్ను దూషిస్తుందని ఆయన అన్నారు. కోలార్ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాము అధికారంలోకి వస్తే ‘భజరంగ్ దళ్’ నిషేధిస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించడంతో కర్ణాటక ఎన్నికల్లో ప్రకంపనలు రేపింది. ప్రస్తుతం దీని ఆధారంగానే ప్రచారం కొనసాగిస్తున్నాయి పార్టీలు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోని విమర్శిస్తూ.. ప్రజలు ఓటేసే ముందు ‘జై భజరంగబలి’ అని ఓటేయాని ప్రధాని మోదీ సూచించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది. అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ గురువారం వ్యాఖ్యానించారు. మే 10న కర్ణాటక రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి.