Asaduddin Owaisi: ముస్లింల పట్ల ప్రధాని నరేంద్రమోడీ వైఖరిని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్న ఓవైసీ విమర్శించారు. ఇటీవల కాంగ్రెస్ చేసిన ‘సంపద పునర్విభన’ వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ, రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ‘‘ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన సంపదను చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పంచాలని అనుకుంటోంది. చివరకు మన తల్లలు, సోదరీమణుల మంగళసూత్రాలను కూడా దోచుకుంటారు’’ అని అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలు ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని అన్నట్లు విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల ఫలితంగా దేశంలో ఎక్కడైనా అల్లర్లు జరిగితే దానికి ప్రధానమంత్రి బాధ్యత వహించాలి అని ఓవైసీ అన్నారు. ఇది ముస్లింలపై ద్వేషం నింపడమే తప్ప మరొకటి కాదని విమర్శించారు. అతనను 2022 నుంచి దీన్ని చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో 17 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, ఇది భారతదేశంలో అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా మారింది ఎంఐఎం చీఫ్ చెప్పారు.
Read Also: Vemireddy Prashanthi Reddy: లక్ష మెజార్టీతో గెలుస్తున్నా.. ఆయన అవినీతి చరిత్ర బయట పెడతా..!
‘‘ ఆయన దేశంలోని 140 కోట్ల ప్రజలకు ప్రధానమంత్రి. వారిని(ముస్లింలనను)ఇలా బాధపెట్టడం, ద్వేషించడం.. రేపు దేశంలో ఎక్కడైనా అల్లర్లు చెలరేగితే దానికి నరేంద్రమోడీ బాధ్యత వహించాలి’’ అని ఓవైసీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను ‘ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి’ పంచుతామని ప్రధాని మోదీ ఆరోపించిన కొద్ది రోజుల తర్వాత అసదుద్దున్ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
సందప పునర్విభజనపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, ఆ పార్టీ మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ, ఇటీవల రాజస్థాన్ బన్స్వారాలో ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ కాంగ్రెస్ మేనిఫెస్టోలో అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్ల దగ్గర బంగారాన్ని లెక్కించి, దాని గురించిన సమాచారం తెలుసుకుని, ఆ ఆస్తిని పంచుతామని చెబుతోంది. ఎవరికి వారు పంచుతారు. మన్మోహన్ సింగ్ దేశ ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు ఉందని చెప్పారు’’ అని ప్రధాని అన్నారు. ‘‘ఇంతకుముందు, వారి గ్రెస్) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, దేశ ఆస్తులపై ముస్లింల మొదటి హక్కు అని వారు చెప్పారు. అంటే ఈ ఆస్తి ఎవరికి పంచాలి? ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు. చొరబాటుదారులకు పంపిణీ చేయబడుతుంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు చొరబాటుదారులకు వెళ్లాలా? మీరు దీన్ని ఆమోదిస్తారా?’’ అని మోడీ ప్రజలను అడిగారు. అయితే, తమ మేనిఫెస్టోలో అలాంటి వాదనలు లేవని కాంగ్రెస్ తిరస్కరించింది. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించింది.
