Site icon NTV Telugu

Bihar: బీహార్ ఓటర్ల జాబితా నుంచి 52 లక్షలకు పైగా పేర్లు తొలగింపు..

Bihar Elections

Bihar Elections

Bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సవరణలు చేపడుతోంది. బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 52 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురించబడుతుంది. ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుంది. తొలగించిన పేర్లలో చనిపోయినట్లు నివేదించబడిన 18 లక్షల మంది ఓటర్లు, ఇతర నియోజకవర్గాలకు వెళ్లిన 26 లక్షల మంది, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్న 7 లక్షల మంది ఉన్నారని కమిషన్ తెలిపింది.

Read Also: Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దీర్ఘకాలిక నరాల వ్యాధి..

ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1, 2025 వరకు ప్రజలు అభ్యంతరాలు తెలుపవచ్చని ఈసీ చెప్పింది. బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో భాగంగా పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను గుర్తించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రోహింగ్యాలు, స్థానికేతరులు, రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటాన్ని గుర్తించారు. అయితే, ఈ కార్యక్రమంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. కావాలని బీజేపీ ఓటర్లను తీసేస్తుందని ఆరోపించింది.

అర్హులైన ఓటర్లందరినీ ముసాయిదా జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కమిషన్ తెలిపింది. కమిషన్ జారీ చేసిన ప్రకటన ప్రకారం, 12 రాజకీయ పార్టీల నుండి దాదాపు 1 లక్ష మంది బూత్ లెవల్ అధికారులు (BLOలు), 4 లక్షల మంది వాలంటీర్లు, 1.5 లక్షల మంది బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) ఈ ప్రక్రియలో సహాయం చేస్తున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు అభ్యంతరాలను దాఖలు చేయవచ్చని ఈసీ తెలిపింది.

Exit mobile version