Nigeria: చర్చ్‌లో ఉగ్ర కాల్పులు.. 50 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నైజీరియా దేశంలో దారుణం జరిగింది. ఓవో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుడు ఘటనలో 50 మంది మరణించారు.ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చిలో పెంతెకోస్ట్ ఆరాధకులు గుమిగూడిన సమయంలో వారిని లక్ష్యంగా చేసుకొని ముష్కరులు దాడి చేశారని శాసనసభ్యుడు ఒగున్మోలసుయి ఒలువోలే తెలిపారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు.
ఓండో రాష్ట్రంలోని ఓవోలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చ్‌లో ప్రజలు ప్రార్థనలు చేసుకుంటున్నారు. అయితే చర్చిలోకి చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిగిపాడని.. చర్చ్ పీఠాధిపతి కూడా అపహరణకు గురయ్యారని నైజీరియా దిగువ శాసన సభ ప్రతినిధి అడెలెగ్బే టిమిలీయిన్ చెప్పారు. చర్చ్ లో జరిగిన కాల్పుల ఘటన అనంతరం తమ హృదయాలు బరువెక్కాయని ఒండో గవర్నర్ రోటిమి అకెరెడోలు ట్వీట్ చేశారు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
మృతుల సంఖ్యను అధికారులు వెంటనే అధికారికంగా విడుదల చేయలేదు. కనీసం 50 మంది మరణించారని టిమిలీన్ చెప్పారు. చర్చ్ లో అరాధకులు రక్తపు మడుల్లో పడి ఉండటంతో ప్రజలు విలపించారు.పిశాచాలు మాత్రమే ఇలాంటి దారుణచర్యకు పాల్పడతాయని నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారి వ్యాఖ్యానించారు.చర్చిపై దాడి వెనుక ఎవరున్నారో ఇంకా తెలియరాలేదు.ఓవో చరిత్రలో ఇంత దారుణమైన ఘటన ఎప్పుడూ ఎదురుకాలేదని శాసనమండలి సభ్యుడు ఓలువోలే అన్నారు.
తాజావార్తలు
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
-
Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!