NTV Telugu Site icon

Lok Sabha: కోర్టుల్లో పెండింగ్‌ కేసులపై కేంద్రం కీలక ప్రకటన.. ఎన్ని కేసులున్నాయంటే..!

Court

Court

దేశ వ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Pickle In Hotel Meals: హోటల్ భోజనంలో ఊరగాయ పెట్టలేదని కోర్టులో కేసు.. చివరకు?

గరిష్ఠంగా 1.18 కోట్ల కేసులు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సబార్డినేట్‌ కోర్టుల్లోనే ఉన్నాయని తెలిపారు. మొత్తంగా 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండగా.. వీటిలో సుప్రీంకోర్టులో 84,045, వివిధ హైకోర్టుల్లో 60,11,678 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యధికంగా జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లోనే 4,53,51,913 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కోర్టుల్లో సరిపడా భౌతికపరమైన వనరులు లేకపోవడం, కేసుల్లోని వాస్తవాలు తేలడంలో సంక్లిష్టత, సాక్ష్యాలు, లిటిగేషన్లు.. ఇలా పలు కారణాలతో కోర్టుల్లో కేసులు పెండింగ్‌ పడుతున్నాయని చెప్పారు. నియమాలు మరియు విధానాలను సరిగ్గా అమలు చేయడం కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: Mamata Banerjee: నీతి ఆయోగ్‌ సమావేశంలో కేంద్రాన్ని నిలదీస్తా..

కేసుల పరిష్కారంలో జాప్యానికి దారితీసే ఇతర అంశాలు వివిధ రకాల కేసుల పరిష్కారానికి కోర్టులు నిర్దేశించిన కాలపరిమితి లేకపోవడం, తరచూ వాయిదాలు వేయడం మరియు విచారణ కోసం పర్యవేక్షించడానికి, ట్రాక్ చేయడానికి మరియు బంచ్ కేసులను పర్యవేక్షించడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడం ఒక కారణమని మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి: Veeranjaneyulu Vihara Yatra: ‘వీరాంజనేయులు విహారయాత్ర’ గట్టిగా సౌండ్ చేసేలా ఉందే!