NTV Telugu Site icon

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌తో 7 ఏళ్ల కొడుకు ఆస్పత్రి వెళ్లడం ఏంటి..? జవాబు లేని 5 ప్రశ్నలు..

Saif Ali Khan Stabbed,

Saif Ali Khan Stabbed,

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగి దాదాపుగా ఒకటిన్నర రోజు కావస్తోంది. అయితే, ఇప్పటికీ 5 ప్రశ్నలకు మాత్రం సమాధానం లభించడం లేదు. ఆయనపై దాడి ఘటన మొత్తం చిత్రపరిశ్రమనే షాక్‌కి గురిచేసింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేసి 6 చోట్ల గాయపరిచాడు. ఆటోలో లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం సైఫ్ పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు.

1) చొరబాటుదారుడు బిల్డింగ్ సెక్యూరిటీని ఎలా తప్పించుకున్నాడు..?

బాంద్రాలోని సంపన్నులు ఉండే ప్రాంతంలో సైఫ్ అలీ ఖాన్ నివాసం ఉంటున్నారు. దాడి అనంతరం ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా తెల్లవారుజామున 2.33 గంటలకు నిందితుడు పారిపోయినట్లుగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. మరో వీడియోలో తెల్లవారుజామున 1.37 గంటలకు భవనంలోకి ప్రవేశించినట్లు రికార్డైంది. అతను షాఫ్ట్ కిటీకి ద్వారా బాత్రూంలోకి చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఇక్కడ విషయం ఏంటంటే బిల్డింగ్ సెక్యూరిటీ నుంచి ఎలా తప్పించుకున్నాడనేది పెద్ద ప్రశ్నగా మారింది.

2) ఎలా తప్పించుకున్నాడు..?

ఇంట్లోకి ప్రవేశించి, సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి మళ్లీ ఆ ఇంటి నుంచి ఎవరి కంటా పడకుండా తప్పించుకున్నాడు. అతను గదిలోకి ప్రవేశించిన షాఫ్ట్ కిటీకినే మళ్లీ ఉపయోగించాడా..? అనేది మరో ప్రశ్న.

3) బిల్డింగ్ లేఅవుట్ తెలుసా..?

ఎవరూ గమనించకుండా, పక్కా ప్లాన్ ప్రకారం సైఫ్ అలీ ఖాన్ ఉంటున్న డ్యూప్లెక్స్ ఇంటికిలోకి చొరబాటుదారుడు ఎలా వచ్చాడు. అతడికి బిల్డింగ్ లేఅవుట్ గురించి పూర్తిగా తెలుసా అనే ప్రశ్నిని లేవనెత్తుతోంది. లేఅవుట్ గురించి తెలుసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఇంతకుముందు ఆ బిల్డింగ్‌లోకి వచ్చి ఉండాలి లేదా హౌసింగ్ సొసైటీలో ఎవరైనా అతడికి సమాచారం ఇచ్చి ఉండాలి.

4) సైఫ్ అలీ ఖాన్‌ని ఆటోలో ఎందుకు తీసుకెళ్లారు..?

కోట్లకు అధిపతి, బిల్డింగ్ నిండా కార్లు అయినా కూడా ఆయనను ఓ ఆటోలో ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారు.? అనేది మరో ప్రశ్న. నివేదికల ప్రకారం, ఘటన జరిగిన వెనువెంటనే కారుని సిద్ధం చేయలేకపోవడమో, డ్రైవర్ అందుబాటులో లేకపోవడమో కారణమని చెబుతున్నారు. తన చిన్న కొడుడు, 7 ఏళ్ల తైమూర్, అతడి కేర్‌టేకర్ మాత్రమే సైఫ్‌తో ఆస్పత్రికి వెళ్లారు.

5) కుటుంబ సభ్యులు ఎందుకు ఆస్పత్రికి వెళ్లలేదు..?

రక్తం కారుతూ, తీవ్ర ప్రమాదంలో ఉన్న సైఫ్ వెంట కేవలం 7 ఏళ్ల తైమూర్ మాత్రమే ఎందుకు వెళ్లాడు..? కుటుంబ సభ్యులు మరెవరు తోడుగా ఎందుకు లేరనేది అందర్ని తొలుస్తోంది. దాడి సమయంలో భార్య కరీనా ఉన్నప్పటికీ, ఆయన సైఫ్ వెంట ఆస్పత్రికి వెళ్లలేదు.