యువ భారత్ కదులుతోంది.. వ్యాక్సినేషన్ సెంటర్ల వైపు అడుగులు వేస్తోంది.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైకా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.. 15-18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతించిన తరుణంలో.. కేవలం మూడు రోజుల్లోనే కోటి మందికి పైగా టీనేజర్లు వ్యాక్సిన్ వేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.. మూడు రోజుల్లో కోటి మంది టీనేజర్లు కోవిడ్టీకాపంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. వ్యాక్సిన్వేయించుకోవడానికి ఉత్సాహం చూపుతున్న యువతను అభినందించారు…