PM Narendra Modi: అభివృద్దే మా ప్రాధాన్యత.. ఓటు బ్యాంకు రాజకీయాలు కావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: మా ప్రాధాన్యత అభివృద్ది, ఓటు బ్యాంకు రాజకీయాలు కావని ప్రధాని నరేంద్రమోదీ గురువారం అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు, రాజకీయా పార్టీలు రోడ్డు, విద్యుత్, నీటి సదుపాయాల కోసం పనిచేయకుండా.. ఓటు బ్యాంకు రాజకీయాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపించేవని విమర్శించారు. గురువారం, ప్రధాని మోదీ కర్ణాటకలోని కోడెకల్ జిల్లాలో సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులతో పాటు జాతీయ రహదారి అభివృద్ధికి సంబంధించి అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
Read Also: Gopichand Malineni: శృతి హాసన్ తో ఎఫైర్.. గోపీచంద్ ఏమన్నాడంటే..?
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా, రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు. ప్రతీ ఇంటికి సురక్షితమైన, తగినంత తాగు నీరు అందిచాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ పథకానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ పథకం కిందన 117 ఎంఎల్డీ నీటిశుద్ధి ప్లాంట్లను నిర్మించనున్నారు.
జల్ జీవన్ మిషన్ 3.5 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని, అంతకుముందు దేశంలో 18 కోట్ల గ్రామీణ కుటుంబాలకు 3 కోట్ల కుటుంబాలకు మాత్రమే కుళాయి సదుపాయం ఉందేదని.. ఇప్పుడు దేశంలో 11 కోట్ల గ్రామీణ కుటుంబాలు కుళాయి నీటిని పొందుతున్నాయిని ప్రధాని మోదీ వెల్లడించారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించిన జిల్లాల్లో అభివృద్ధి, సుపరిపాలన తీసుకువచ్చామని ఆయన అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 224 అసెంబ్లీ సీట్లలో 150 సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!