Gopichand Malineni: శృతి హాసన్ తో ఎఫైర్.. గోపీచంద్ ఏమన్నాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gopichand Malineni: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ ఎన్ని ప్రశంసలు ఉంటాయో అన్నే విమర్శలు ఉంటాయి. విమర్శలను తట్టుకోలేని వారు ప్రశంసలు అందుకోనేవరకు వెళ్లరు ఇక ఒక హీరో హీరోయిన్ కానీ. ఒక డైరెక్టర్, హీరోయిన్ కానీ వరుసగా మూడు నాలుగు సినిమాలు చేయడం ఆలస్యం.. వారిమధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టించేస్తారు. దానివలన హీరోయిన్లు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఇండస్ట్రీ టాక్. ఇక తాజాగా ఒక డైరెక్టర్ కు, హీరోయిన్ కు మధ్య ఎఫైర్ ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ హీరోయిన్, డైరెక్టర్ ఎవరో కాదు.. వీర సింహారెడ్డి సినిమాతో బాలయ్య కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. బాలయ్యతో నటించిన శృతి హాసన్. శృతి, గోపీచంద్ కాంబో లో ఇప్పటికి మూడు సినిమాలు వచ్చాయి. బలుపు, క్రాక్, వీరసింహారెడ్డి. గోపీచంద్ మీద ఉన్న అభిమానంతోనే శృతి, వీరసింహారెడ్డి లో బాలయ్య సరసన నటించడానికి ఒప్పుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గోపీచంద్, శృతికి ఐ లవ్ యూ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆయన మాట్లాడిన వెంటనే శృతి, గోపీచంద్ ను అన్నయ్య అని పిలవడంతో మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. ఇక ఈ ఈవెంట్ తర్వాత వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు మొదలయ్యాయి.
Ram Chran: తమ్ముడికి స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పిన చరణ్
Also Read
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
ఇక తాజాగా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “శృతితో నేను మూడు సినిమాలు చేశాను. చాలా మంచి అమ్మాయి. ఆమెతో కలిసి మూడు సినిమాలు పనిచేయడం వలన నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయింది. తన యాక్టింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం.. మా ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఉంది. శృతి మా ఇంటికి కూడా వస్తుంది.. నా వైఫ్ కు కూడా ఆమె అంటే ఎంతో ఇష్టం. ఇక నా కొడుకు కూడా శృతిని ఇష్టపడతాడు. ఎప్పుడు హైదరాబాద్ కు వచ్చినా వాడికి చాక్లెట్స్ తెస్తూ ఉంటుంది. మా మధ్య ఆ బంధం ఉండబట్టే స్టేజిపై నన్ను అన్నయ్య అని పిలిచింది. ఒక అమ్మాయి- అబ్బాయి లవ్ యూ అని చెప్పుకున్నంత వారిమధ్య ఏదో ఉందని ఊహించేసుకొని వచ్చిన ట్రోల్స్ చూసి నేను నవ్వుకున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!