Site icon NTV Telugu

Asaduddin Owaisi: పాక్ ఉగ్రవాద దేశం.. ఈసారి దాడి చేస్తే.. నాశనం చేస్తాం!

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: పాకిస్తాన్ దుర్మార్గాలను వివరించేందుకు సౌదీ అరేబియాతో పాటు కువైట్‌, బహ్రెయిన్‌ దేశాల పర్యటనకు ఒడిశా బీజేపీ ఎంపీ బైజయంత్‌ పాండా నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం బహ్రెయిన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. గత చాలా సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేయడానికి మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపిందన్నారు. ఉగ్రవాద దేశం వల్ల మేము చాలా మంది అమాయక ప్రాణాలను కోల్పోయామని పేర్కొన్నారు. ఈ సమస్య పాకిస్తాన్ నుంచి మాత్రమే ఉద్భవిస్తుందని తెలిపారు. పాకిస్తాన్ ఈ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం, వారికి సహాయం చేయడంఆపివేసే వరకు ఈ సమస్య తొలగిపోదని ఒవైసీ అన్నారు.

Read Also: S**X On Road: బరితెగించిన రాజకీయ నేత.. రోడ్డుమీదే కారు ఆపి పబ్లిక్ గా శృంగారలీలలు..!

అయితే, ప్రతి భారతీయుడి ప్రాణాలను కాపాడటానికి మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. మరోసారి పాకిస్తాన్ దాడులకు పాల్పడితే.. ఆ తర్వాత వారు ఆశించిన దానికంటే ఎక్కువగా ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశారు. మళ్లీ మళ్లీ రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నప్పటికీ భారతదేశం సంయమనం పాటించిందని పేర్కొన్నారు. పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా చంపేసిన ఘటనను గుర్తు చేశారు.. ఉగ్రవాదం వల్ల జరిగే మానవ నష్టాన్ని నొక్కి చెప్పారు. దయచేసి ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్ కు సహాయం చేయాలని అసదుద్దీన్ ఒవైసీ కోరారు.

Read Also: Akanda 2 : బాలయ్య ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ పై బిగ్‌ అప్‌డేట్‌

ఇక, ఉగ్రవాద నిధులను అరికట్టడంలో అంతర్జాతీయ సహకారం అవసరమని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. పాకిస్తాన్‌ను FATF గ్రే లిస్ట్‌లోకి తిరిగి తీసుకురావడానికి బహ్రెయిన్ ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే, పాక్ కు సహాయం కోసం ఇచ్చే నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లీస్తుందని ఆరోపించారు. దయచేసి దాయాది దేశానికి నిధులు మంజూరు చేయొద్దు అని ఒవైసీ తెలిపారు.

Exit mobile version