Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Orgotten History Pakistan Leaders Once Attended Indias Republic Day As Chief Guests

Republic Day: రిపబ్లిక్ డేకు “పాకిస్తాన్” ముఖ్య అతిథులు.. ఆహ్వానించిన భారత ప్రధానులు వీరే..

Published Date :January 24, 2026 , 6:27 pm
By Venu Goapl Reddy
  • భారత గణతంత్ర దినోత్సవానికి పాకిస్తాన్ ‘‘ముఖ్య అతిథులు’’..
  • పాక్ నేతల్ని ఆహ్వానించిన నెహ్రూ, శాస్త్రీ..
Republic Day: రిపబ్లిక్ డేకు “పాకిస్తాన్” ముఖ్య అతిథులు.. ఆహ్వానించిన భారత ప్రధానులు వీరే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Republic Day: భారత చివరకు ప్రత్యర్థి పాకిస్తాన్. దాయాది దేశం ఏర్పడినప్పటి నుంచీ భారత్‌ను చిరాకు పరచాలనే చూస్తోంది. భారత్ ఎదుగుతుంటే తట్టుకోలేక ఉగ్రవాదాన్ని సాధనంగా ఉపయోగించుకుంటోంది. 1947 నుంచి ఈ పరిస్థితుల్లో మార్పు రాలేదు. పలు సందర్భాల్లో మిత్రుత్వం కోసం చేయిచాచినా, పాక్ తన బుద్ధిని మార్చుకోలేదు. సాధారణంగా ప్రతీ ఏడాది మన గణతంత్ర దినోత్సవానికి విదేశాలకు చెందిన ముఖ్యులు అతిథులుగా ఆహ్వానించబడుతుంటారు. అయితే, రెండు సార్లు భారత్ పాకిస్తాన్‌కు చెందిన నేతల్ని రిపబ్లిక్ డే ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. ఈ ఆహ్వానాలు విభజన గాయాలు ఇంకా మానని కాలంలో జరిగాయి.

1955లో నెహ్రూ కాలంలో తొలి ఆహ్వానం..

1955లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ గవర్నర్ జనరల్ సర్ మాలిక్ గులాం మహ్మద్‌ను గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ ఏడాదే రిపబ్లిక్ డే పెరేడ్ రాజ్‌పథ్( ప్రస్తుతం కర్తవ్యపథ్)లో నిర్వహించారు. దీనికి ముందు ఈ పరేడ్ ఇర్విన్ స్టేడియం(ఇప్పటి మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం)లో జరిగింది.

మాలిక్ గులాం మహ్మద్ పాకిస్తాన్ మూడో గవర్నర్ జనరల్. బ్రిటిష్ ఇండియన్ సివిల్ సర్వీస్(ఐసీఎస్) అధికారిగా పనిచేశారు. పాకిస్తాన్ తొలి దశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, ఈయన పాలనలోనే పాకిస్తాన్ ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నదన్న విమర్శలు వచ్చాయి. ప్రధానిని తొలగించడం, రాజ్యాంగ సభను రద్దు చేయడం వంటి చర్యలు పాకిస్తాన్‌లో సైనిక-పౌర అసమతుల్యతకు కారణమయ్యాయని చరిత్ర చెబుతోంది.

1965: శాస్త్రి ఆహ్వానం.. పాక్ వెన్నుపోటు..

నెహ్రూ తర్వాత 10 ఏళ్లకు 1965లో లాల్ బహదూర్ శాస్త్రి మరోసారి పాకిస్తాన్ నేతను రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. పాక్ వ్యవసాయ శాఖ మంత్రి రానా అబ్దుల్ హమీద్‌ ఈసారి భారత అతిథిగా వచ్చారు. ఈ ఆహ్వానం భారత్-పాక్ మధ్య సంబంధాలను బలపరచాలనే ఉద్దేశ్యంతో కూడుకున్నది.

జనవరిలో అతిథిగా ఆహ్వానిస్తే, ఏప్రిల్‌లో పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచింది. ఏప్రిల్ 1965లో పాకిస్తాన్ రాన్ ఆఫ్ కచ్‌లో సైనిక దాడిని చేసింది. ఆగస్టులో ఆపరేషన్ గిబ్రాల్టర్ ద్వారా కాశ్మీర్‌లోకి చొరబాటుకు ప్రయత్నించింది. చివరకు 1965 భారత్-పాక్ యుద్ధం జరిగింది.

మోడీ హయాంలో కూడా..

దాదాపు 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా పాక్‌తో సత్సంబంధాల కోసం ప్రయత్నించారు. అయితే, రిపబ్లిక్ డే, స్వాతంత్ర దినోత్సవం వంటి కార్యక్రమాలకు మాత్రం పాక్ నేతల్ని అతిథులుగా ఆహ్వానించలేదు. కానీ 2014లో తన ప్రమాణస్వీకారానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆమ్బానించారు. 2015లో అనూహ్యంగా లాహోర్‌ను సందర్శించారు. కానీ, పాక్ మళ్లీ అదే బుద్ధిని చూపించింది. ఉగ్రవాదుల దాడులు, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India Pakistan war 1965
  • india- pakistan relations
  • jawaharlal nehru
  • Lal Bahadur Shastri
  • Malik Ghulam Muhammad

తాజావార్తలు

  • Allu Arjun : కౌంట్‌డౌన్ స్టార్ట్.. వచ్చే వారమే అల్లు ఫెస్ట్

  • Rashmika: ‘ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం’.. అప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన క్రేజీ కపుల్!.. రష్మిక పోస్ట్ వైరల్..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • Trump: ఇరాన్‌లో ఇంకా విధ్వంసం మొదలవ్వలేదు.. భారీ వంతెన కూల్చిన తర్వాత ట్రంప్ ప్రకటన

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

ట్రెండింగ్‌

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions