బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ సర్వేపై అటు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ.. ఇటు అసెంబ్లీలోనూ విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిపోతున్నాయి. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పట్టుమని పది నిమిషాలు కూడా సభ నడవలేదు. వరుసగా వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం చేపట్టిన ‘SIR’పై పెద్ద ఎత్తున విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. తాజాగా ఇదే అంశంపై బీహార్ అసెంబ్లీ కూడా దద్దరిల్లింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్-ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఇది కూడా చదవండి: Indian Passport: భారతీయులకు శుభవార్త.. ఇకపై 59 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్!
ఈ ఓటర్ సర్వే అధికార పార్టీకి అనుకూలంగా చేపట్టారని తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారిందని ధ్వజమెత్తారు. దీంతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై సీఎం నితీష్ కుమార్ నిప్పులు చెరిగారు. నువ్వెంత.. నీ వయస్సెంత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాన్న, మీ అమ్మ సీఎంగా ఉన్నప్పుడు పరిస్థితులు తెలుసా.. ఓటర్ల జాబితా సవరణపై ఎందుకు గగ్గోలు పెడుతున్నావ్ అంటూ నితీష్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలా అధికార-ప్రతిపక్ష నేత మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరిగింది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. భర్త అలా చేయలేదని చంపేసిన భార్య
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ సర్వే చేపట్టింది. ఎక్కువగా విదేశీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారంటూ 52 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించింది. అయితే ఈసీ అధికార ఎన్డీఏకు తొత్తుగా మారిందంటూ విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి.
