Site icon NTV Telugu

Bengaluru Meeting: నేడు బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం…. హాజరు కానున్న సోనియాగాంధీ

Sonia Gandhi

Sonia Gandhi

Bengaluru Meeting: 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడానికి ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ప్రతిపక్షాలు ఒకసారి బీహార్‌ రాజధాని పాట్నాలో గత నెల జూన్‌ 23న భేటీ అయ్యాయి. నేడు బెంగళూరులో మరోసారి సమావేశం కావాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. బెంగుళూరులోని ఒక ప్రైవేటు హోటల్‌ వేదికగా విపక్షాల సమావేశం జరగనుంది. సమావేశం రేపు కూడా కొనసాగనుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లో జరిగే సమావేశానికి 24 పార్టీ లకు చెందిన 49 మంది ఆగ్రనేతలు హాజరుకానున్నారు. సమావేశంలో పాల్గొనడానికి బెంగుళూరు HAL airportకి మధ్యాహ్నం 2.30 గంటలకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే చేరుకోనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఐక్యంగా ఉన్నామనే ప్రకటనతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తొలి సమావేశానికి 16 పార్టీలను ఆహ్వానించారు. అయితే మొదటి సమావేశానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ హాజరు కాకపోవడంతో 15 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. నేడు జరిగే సమావేశంలో 24 పార్టీల అధినేతలు పాల్గొననున్నారు. విపక్షాల సమావేశానికి హాజరయ్యే అన్ని పార్టీ ల నేతలకు ఇవ్వాళ రాత్రికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య డిన్నర్ ఇవ్వనున్నారు. కాలు కి దెబ్బ తగిలినా…సోనియా గాంధీ ఆహ్వానం మేరకు TMC అధినేత మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read also: Kiran Abbavaram: ‘రూల్స్ రంజన్’ని రాధిక సమ్మోహన పరుస్తుందిగా

సోమ, మంగళవారాల్లో కాంగ్రెస్‌ సహా 24 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశం కానున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగే భేటీలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్, స్టాలిన్, మమతాబెనర్జీ కూడా సమావేశంలో పాల్గొననున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతిపక్షాలు ఏకం కావడంతో.. బీజేపీ కూడా తన స్పీడ్ పెంచింది. ఎన్‌డీఏ పక్ష మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రేపు ఎన్‌డీఏ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎన్‌డీఏ పక్ష సమావేశానికి జనసేన పార్టీని కూడా ఆహ్వానించింది.

Read also: Sugar for Hair: తలకు చక్కెర వాడటం గురించి ఎప్పుడైనా విన్నారా?

ప్రతిపక్షాల మొదటి సమావేశం జూన్‌ 23న బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ పాట్నాలో ప్రతిపక్షాల మొదటి సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. నేడు జరిగే సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొంటుండగా.. నితీశ్‌కుమార్‌ (జేడీయూ), మమతా బెనర్జీ (టీఎంసీ), ఎంకే.స్టాలిన్‌ (డీఎంకే), హేమంత్‌సోరెన్‌ (జేఎంఎం), ఉద్ధవ్‌ఠాక్రే (ఎస్‌ఎస్‌–యుబీటీ), శరద్‌పవార్‌ (ఎన్‌సీపీ), డి.రాజా(సీపీఐ), లాలూప్రసాద్‌ యాదవ్‌ (ఆర్‌జేడీ), అఖిలేశ్‌యాదవ్‌ (ఎస్‌పీ), సీతారాం ఏచూరి (సీపీఐఎం), ఒమర్‌ అబ్దుల్లా (ఎన్‌సీపీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), దీపాంకర్‌ భట్టాచార్య (సీపీఐఎంఎల్‌) తదితరులు పాల్గొంటారు. ఢిల్లీలో యంత్రాంగంపై పెత్తనం కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రయత్నాలు సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని తెలిపింది. మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన ఆప్‌.. బెంగళూరులో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తాము కూడా హాజరవుతామని ఆ పార్టీ నేత రాఘవ్‌ చద్దా తెలిపారు. ఆదివారం జరిగిన ఆప్‌ పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

Read also: IND Playing XI WI: విరాట్ కోహ్లీ ఔట్.. వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ ఆడే భారత జట్టిదే!

కాంగ్రెస్ మీటింగ్ జేడీఎస్‌ దూరం
నేడు జరిగే ప్రతిపక్షాల సమావేశానికి జేడీఎస్‌ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రం లో 45 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటే ..కర్నాటక లో కాంగ్రెస్ కూటమి రాజకీయాలు చేస్తోందంటూ జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి విమర్శించారు. కుమార స్వామి రేపు ఢిల్లీ కి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కుమారస్వామి బీజేపి తో పొత్తులకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. JDS తో పొత్తుకు కర్ణాటక బీజేపి నేతలు నో చెబుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో 20 MP స్థానాలు ఒంటరిగా పోటీ చేసి గెలిచామని కర్ణాటక బీజేపి నేతలు చెబుతున్నారు. కానీ కుమారస్వామి తో కలసి వెళ్లేందుకు ఢిల్లీ బీజేపి బాసులు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version