NTV Telugu Site icon

Opposition Meeting: బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం.. హాజరుకానున్న ముఖ్య పార్టీ నేతలు..!

Opposition

Opposition

బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే.. ఒక్కొక్కటిగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కగూటికి చేరుతున్నాయి. బీజేపీని దెబ్బకొట్టేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన ఓసారి ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి 15 మంది ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. మరోసారి సమావేశమయ్యేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యారు. రేపటి నుంచి (జులై 17) రెండురోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం జరగనుంది.

Rashmika mandanna : బేబీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..

ఈ సమావేశంలో దాదాపు 24 ప్రతిపక్ష పార్టీలు పాల్గొననున్నాయి. మొదటి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ ​​పార్టీ అధినేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇప్పుడు బెంగళూరులో జరగనున్న సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తోంది. బెంగళూరులో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా హాజరయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా.. కాలికి గాయం కావడంతో ఆమె సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సమావేశానికి తమ తరపు నుంచి ఓ ప్రతినిధి హాజరుకానున్నారు.

Kethika Sharma :పొట్టి డ్రెస్ లో థైస్ షోతో మతులు చెడగొడుతున్న కేతికా శర్మ..

మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపింది. ఆదివారం జరిగిన పార్టీ పీఏసీ సమావేశం అనంతరం ఆప్ నేత, ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తమ పార్టీ హాజరవుతుందని చెప్పారు. కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం), సమాజ్ వాదీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం), తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, జేడీ(యూ), షనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ (ఎంఎల్), జేఎంఎం, ఆర్‌ఎల్‌డీ, ఆర్ఎస్పీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (ఎం), వీసీకే, ఎండీఎంకే, కేడీఎంకే, కేరళ కాంగ్రెస్ (జే), ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు హాజరుకానున్నాయి.