ప్రధాని మోడీ బలమైన సంకల్పం.. నిఘా సంస్థల కచ్చితమైన సమాచారం.. సాయుధ దళాల అద్భుత ప్రదర్శన వల్లే ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సరిహద్దు భద్రతా దళం (BSF) ఇన్వెస్టిచర్ వేడుక మరియు రుస్తంజీ స్మారక ఉపన్యాసం సందర్భంగా అమిత్ షా ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో బీఎస్ఎఫ్ ప్రదర్శించిన ఆదర్శప్రాయమైన పనితీరును ప్రశంసించారు. సరిహద్దు వెంబడి జరుగుతున్న దుష్ట కార్యకలాపాలను బీఎస్ఎఫ్ దళం సమర్థవంతంగా అడ్డుకున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Shubman Gill: కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. ఓపెనర్‌గా రోహిత్ స్థానంలో ఎవరంటే?
భారత్‌లో ఉగ్రవాదానికి పాకిస్థానే స్పాన్సర్ అని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదానికి దీటై జవాబు ఇచ్చామని చెప్పారు. పహల్గామ్ దాడులతో అన్ని హద్దులు దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి.. వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిందన్నారు. పాక్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలను భారత్ బయటపెట్టడంతో.. ఆ దేశం ఉగ్రవాదులను పోషిస్తుందనే నిజం మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచమంతా కొనియాడిందని అమిత్ షా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Cyber Fraud: డిజిటల్ అరెస్ట్ పేరుతో.. న్యాయవాది నుంచి రూ. 19 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
బంగ్లాదేశ్‌తో సహా అంతర్జాతీయ సరిహద్దులను కాపాడటంలో బీఎస్‌ఎఫ్ పాత్రను అభినందించారు. పాకిస్థాన్ చేస్తున్న తప్పిదాల వల్ల భారత్ అనేక దశాబ్దాలుగా ఉగ్ర సమస్యను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి భారత్ ఉగ్ర దాడులకు గట్టి బదులిస్తోందని అన్నారు. పహల్గామ్ ఘటన సమయంలో ఉగ్రవాదులు పర్యాటకులను మతం అడిగి మరీ చంపడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆపరేషన్ సిందూర్‌లో కేవలం ఉగ్రవాద స్థావరాలే ధ్వంసమయ్యాయని.. ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. కానీ పాక్ సైన్యం మాత్రం నిషేధిత ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరై.. ఉగ్రవాదానికి మద్దతు పలికారని అమిత్‌షా అన్నారు. వారి చర్యలను ప్రపంచం మొత్తం చూసిందని.. ఉగ్రవాదుల వెనక ఎవరు ఉన్నారనే విషయం అన్ని దేశాలకు అర్థమయ్యిందని తెలిపారు.
