Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ని చావు దెబ్బ తీసింది భారత్. ఇటు ఉగ్రవాదుల స్థావరాలను నాశం చేస్తూనే, మరోవైపు పాక్ మిలిటరీకి గట్టి గుణపాఠం నేర్పింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతను కూడా భారత్ బహిర్గతం చేసింది. ఇన్నాళ్లు తమ మిలిటరీ శక్తిని చూస్తూ గర్వపడిన పాకిస్తాన్‌కి భారత్ గర్వభంగం చేసింది. తమతో పెట్టుకుంటే పాకిస్తాన్ హర్ట్ ల్యాండ్‌లో కూడా దాడులు చేస్తామని నిరూపించింది.
పాకిస్తాన్ ప్రధాన నగరాలైన కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, సియాల్ కోట్, సర్గోదా, బహవల్పూర్, గుజ్రాన్ వాలా ఇలా ప్రతీ పాకిస్తాన్ నగరంపై భారత్ దాడులు చేసింది. ఈ నగరాల్లో పాకిస్తాన్ టెర్రరిస్టులు, మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ప్రధానంగా పాకిస్తాన్‌లో నాలుగు ప్రావిన్సులు ఉన్నాయి. పంజాబ్, సింధ్, బెలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా. అయితే, ఈ నాలుగింటిలో పంజాబ్‌పై భారత్ విస్తృతంగా దాడులు చేసింది. నిజానికి పాకిస్తాన్ లో రాజకీయ, సైనిక నాయకత్వం అంతా పంజాబ్ నుంచే వస్తుంది. మిగిలిన ప్రావిన్సుల్లోని ప్రజల్ని రెండో శ్రేణిగా వీరు చూస్తుంటారు.
Read Also: Rajiv Ghai: ఆపరేషన్ సింధూర్పై డీజీఎంవో ప్రెస్మీట్.. కోహ్లీ రిటైర్మెంట్పై చర్చ
అలాంటిది, పంజాబ్‌పై భారత్ తీవ్రంగా దాడులు చేయడం ఆ దేశ రాజకీయ, సైనిక వర్గాల్లో భయాన్ని పుట్టించింది. సింధ్ ప్రాంతంలోని కరాచీలోని కీలకమై మాలిర్ కంటోన్మెంట్‌పై కూడా భారత్ దాడులు చేసినట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పారు. లాహోర్‌లోని రాడార్ సైట్( బహుశా చైనా HQ-9) ధ్వంసం చేసింది. పంజాబ్ ప్రావిన్సుల్లోని గుజ్రాన్ వాలాకు దగ్గరగా ఉన్న మరో రాడార్ సైట్‌ని కూడా భారత్ నాశనం చేసింది.
శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ రావల్పింది, ఇస్లామాబాద్, లాహోర్, జకోబాబాద్, సర్గోదా, స్కర్దు, సియాల్‌కోట్ ఇలా ప్రధాన నగరాల్లోని ఎయిర్ బేస్‌ను భారత్ నిర్వీర్యం చేసింది. పాక్ మిలిటరీకి అత్యంత కీలకమైన రఫీకి, మురిద్, చక్లాలా, రహీంయార్ ఖాన్, సర్గోదా ఎయిర్ బేస్‌లను తీవ్రంగా నష్టపరించింది. ఇలా, తాము పాకిస్తాన్‌లోని ఏ ప్రాంతానైనా టార్గెట్ చేస్తామని భారత్ స్పష్టమైన సంకేతాలు పంపించింది.
