Site icon NTV Telugu

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్‌తో అన్ని లక్ష్యాలు సాధించాం

Rajnathsingh

Rajnathsingh

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. భారత్‌పై ఏదైనా దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్థా్న్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హెచ్చరించారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదంపై చర్య తీసుకోవడానికి భారతదేశం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. ఆపరేషన్ సిందూర్‌ ద్వారా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఏవైనా ఉగ్రవాద దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. ఉగ్రవాదులకు వణుకు పుట్టించడంలో ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైందని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Botsa Satyanarayana: వైసీపీ హయాంలో చంద్రబాబును ఎక్కడైనా ఆపామా?

ద్రౌపది ముర్ము.. జూన్ 23తో రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. 51 ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్‌నాథ్‌సింగ్ సహా కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, ఎల్‌.మురుగన్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 10 మంది మృతి.. భారీ భవంతులు ధ్వంసం

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్.. పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. ఇక మే 7న పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. ఇక పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో కాల్పుల విరమణ జరిగింది.

Exit mobile version