Site icon NTV Telugu

Indian Envoy: ఆపరేషన్ సింధూర్ ముగియలేదు.. ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందే!

India Enoy

India Enoy

Indian Envoy: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల దేశాన్ని ఏకాకిని చేసేందుకు ఇండియా అనేక వ్యూహాలు రచిస్తుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టడానికి భారత్ ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి జేపీ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్‌కు “విరామం” ఇచ్చాం అంతే “ముగియలేదని” తేల్చి చెప్పారు. 26/11 ముంబై ఉగ్ర దాడి ప్రధాన సూత్రధారులలో ఒకరైన తహవూర్ హుస్సేన్ రాణాను అమెరికా భారత్ కు అప్పగించినట్లుగానే.. ఇస్లామాబాద్ లోని కీలక ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, సాజిద్ మీర్, జకీర్ రెహ్మాన్ లఖ్వీలను అప్పగించాలని భారత రాయబారి జేపీ సింగ్ డిమాండ్ చేశారు.

Read Also: Thapsee : ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న..

అయితే, పాకిస్తాన్ లోని ఉగ్రవాద గ్రూపులను మాత్రమే భారత్ టార్గెట్ చేసింది.. కానీ, పాక్ మాత్రం మా దేశ సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు ట్రై చేసిందని ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి జేపీ సింగ్ వెల్లడించారు. కాగా, ఉగ్రవాదంపై మా పోరాటం కొనసాగుతుంది.. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా.. వారిని హతమార్చే వరకు ఈ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. మే 10వ తేదీన తెల్లవారుజామున నూర్ ఖాన్ స్థావరంపై భారతదేశం చేసిన దాడిని గేమ్ ఛేంజర్‌గా అతడు అభివర్ణించారు. దీంతో పాకిస్తాన్‌లో భయాందోళనలు స్టార్ట్ కావడంతో.. DGMO కాల్పుల విరమణ కోసం భారత ప్రతినిధులను సంప్రదించిందని రాయబారి జేపీ సింగ్ చెప్పుకొచ్చారు.

Exit mobile version