Operation Kagar: నేటితో ముగుస్తున్న ‘కగార్’ డెడ్‌లైన్.. మావో శకం ముగిసినట్లేనా?
- నేటితో ముగుస్తున్న ‘కగార్’ డెడ్‌లైన్
- ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులు
- నేటితో మావో శకం ముగిసినట్లేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటితో దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన ‘కగార్’ ఆపరేషన్ కార్యక్రమం ముగుస్తోంది. మార్చి 31, 2026 నాటికి దేశాన్ని మావో రహిత దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటికే కగార్ ఆపరేషన్ ద్వారా ఆయా రాష్ట్రాల్లో అడవుల్లో తిష్టవేసిన మావోలను భద్రతా దళాలు ఏరివేశాయి. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఇంకొన్ని గంటల్లో లొంగిపోవాల్సి ఉంటుంది. లేదంటే భద్రతా దళాలు అంతమొందించే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: IPS Couple Wedding: అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్ పెళ్లికూతురు అన్షికా వర్మ
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. దేశంలో మావోయిజం అంతం అయిందని ప్రకటించారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీని నిర్మూలించినట్లుగా వెల్లడించారు. చర్చలతోనే పరిష్కారమని.. ఆయుధాలు చేపట్టే యోచన సరికాదని సూచించారు. నక్సల్స్ హింసలో 5 వేల మంది భద్రతా సిబ్బంది సహా 20వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని.. దీనికంతటికీ 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనే కారణంగా అమిత్ షా ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Opinion Polls Survey: బెంగాల్‌పై తాజా సర్వే వచ్చేసింది.. ఈసారి గెలవబోయేది ఎవరంటే..!
మంగళవారంతో మావోల కోసం కేంద్రం విధించిన గడువైతే ముగుస్తుంది. ఇప్పటికే దండకారణ్యం మొత్తం ఖాళీ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ జాడలేవీ కనిపించడం లేదు. అడువులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దాదాపుగా మావోలంతా సరెండర్ అయినట్లుగా తెలుస్తోంది. పలువురు కీలక నేతలు మాత్రం విదేశాలకు పారిపోయినట్లుగా సమాచారం. ఏదేమైతే మొత్తానికి నేటితో మావో శకం ముగిసినట్లుగానే చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!