Site icon NTV Telugu

Operation Akhal: కుక్క చావు చచ్చారు.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం..

Jammu Kashmir

Jammu Kashmir

Operation Akhal: శుక్రవారం జమ్మూ కాశ్మీర్ కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఎన్‌కౌంటర్ ‘‘ఆపరేషన్ అఖల్’’లో భాగంగా జరిగింది. దేవ్‌సర్ ప్రాంతంలోని అఖల్ అడవిలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఈ ఉమ్మడి ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)తో అనుబంధంగా ఉన్నారని మరియు ఇటీవలి పహల్గామ్ దాడితో సంబంధం కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల్లో లష్కరే కీలక ఉగ్రవాది పుల్వామా నివాసి హరిస్ నజీర్‌ ఉన్నాడు. ఇతడిని భద్రతా బలగాలు ‘‘కేటగిరీ-సీ’’ ఉగ్రవాదిగా గుర్తించింది.

ఈ ప్రాంతంలో ఉగ్రవాద కదలికల గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ సమయంలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. దీంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. శ్రీనగర్‌ సమీపంలోని దచిగామ్ నేషనల్ పార్క్‌ లోపల ఉగ్రవాదులు దాక్కున్నారనే పక్కా సమాచారం ఆధారంగా ఆపరేషన్ నిర్వహించారు.

Read Also: PM Modi: ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ కామెంట్స్‌కి మోడీ అదిరిపోయే కౌంటర్..

ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన కొన్ని రోజులకే ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఆ ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ముగ్గురు టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు ఉన్నారు. పహల్గామ్ కుట్రదారుడు లష్కర్ కమాండర్ సులేమాన్ షా అలియాస్ ముసా ఫౌజీ కూడా ఉన్నారు. వారి రహస్య స్థావరం నుండి 17 గ్రెనేడ్లు, ఒక ఎం4 కార్బైన్ మరియు రెండు ఎకె-47 రైఫిల్స్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల ప్రకారం, ఈ ప్రాంతంలో ఐదుగురు టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నారు. ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు మరణించగా, ఇప్పుడు తాజా ఎన్‌కౌంటర్‌లో ఒకరు హతమయ్యాడు. మరొకరు పరారీలో ఉన్నట్లు భావిస్తున్నారు.

Exit mobile version