NTV Telugu Site icon

Power War: కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య “పవర్ వార్”.. మళ్లీ సుప్రీంకు చేరిన పంచాయతీ..

Arvind Kejriwal

Arvind Kejriwal

Power War: కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ అధికారాల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వ అధికారులపై నియంత్రణ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలపై దృష్టిసారించారు. దీనికి అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. సేవల విభాగం కార్యదర్శి ఆశిష్ మోరేను బదిలీ చేశారు. ఇదిలా ఉంటే అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ ను తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం కొత్తగా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్ష కోరుతూ శనివారం రిప్యూ పిటిషన్ వేసింది.

Read Also: Rahul Gandhi: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంతకం ఆ 5 హామీలపైనే.. అవి ఏంటంటే..?

ఇదిలా ఉంటే కేంద్ర చర్యలపై అరవింద్ కేజ్రీవాల్ ఫైర్ అవుతున్నారు. కేంద్రం సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తోందని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అన్నారు. కేంద్రం సుప్రీంకోర్టుకు సవాల్క విసురుతోందని విమర్శించారు. దీనిపై పోరాటానికి ఆప్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఆర్డినెన్స్ పై సుప్రీంకోర్టుకు వెళ్లనుంది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్ పార్లమెంట్ ఆమోదం పొందదని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపిస్తోన్న అభిషేక్ సింఘ్వీ అన్నారు. మీరు మ్యాచ్ ఓడిపోయినప్పుడు నిబంధనలు మార్చుతుంటారు అంటూ కేంద్రాన్ని విమర్శించారు.

కేంద్రం ఈ ఆర్డినెన్స్ ద్వారా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఇది ఢిల్లీ ప్రభుత్వంలోని ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలపై నిర్ణయాలు తీసుకుంటుంది. దీంట్లో ముఖ్యమంత్రి చైర్ పర్సన్ గా, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ హోం సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. మెజారిటీ ప్రతిపాదికన నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైనా ఓటింగ్ లో ఫలితం తేలకుంటే.. లెఫ్టినెంట్ గవర్నర్ దే తుది నిర్ణయంగా ఉంటుంది.