NTV Telugu Site icon

Onion Price: టమాటా తర్వాత కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 4 రోజుల్లో 25% పెరిగిన ధర..!

Onions

Onions

Onion Price: టొమాటో తర్వాత ఇప్పుడు ఉల్లి కూడా కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. గత 4 రోజుల్లో ఉల్లి ధర కూడా బంపర్ జంప్ నమోదైంది. కిలో రూ.15 పలికిన ఉల్లి ధర.. ఇప్పుడు రూ.20 నుంచి 25కి చేరింది. ఈ విధంగా గత 4 రోజుల్లో ఉల్లి ధర కూడా రూ.10 పెరిగింది. ఉల్లిపాయల హోల్‌సేల్ ధర గురించి మాట్లాడితే.. 25 శాతం పెరిగింది. అతిపెద్ద ఉల్లి మార్కెట్ లాసల్‌గావ్‌లో శుక్రవారం క్వింటాల్ ధర 1300 రూపాయలకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని దుకాణదారులు చెబుతున్నారు.

Read Also: Delhi Metro: ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం.. ప్రయాణికులు లిక్కర్ బాటిల్స్ తీసుకెళ్లేందుకు అనుమతి..

జూన్ 27న నాసిక్ మండిలో ఉల్లి సగటు ధర క్వింటాల్‌కు రూ.1201గా ఉంది. అదే సమయంలో మరుసటి రోజు దాని ధరలో రూ.79 పెరుగుదల నమోదైంది. ఈ విధంగా జూన్ 28న ఉల్లి ధర క్వింటాల్‌కు 1280కి పెరిగింది. మరోవైపు జూన్ 29న ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.1280 నుంచి రూ.1300కి పెరిగింది. టమాటా తర్వాత ఉల్లి ధర పెరగడంతో మామిడి పండ్ల ధరలు తగ్గాయి. ఉల్లి, టమాటా, పచ్చికూరగాయల ధరలు ఇదే విధంగా పెరిగితే రానున్న రోజుల్లో పప్పులే దిక్కని ప్రజలు అంటున్నారు.

Read Also: CM Yogi Adityanath: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ భూమిని పేదలకు పంచిన సీఎం యోగి ఆదిత్యనాథ్..

ఈ సంవత్సరం మహారాష్ట్రతో పాటు రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్‌లలో ఉల్లిపాయల పంట బాగా పండింది. అయితే ఫిబ్రవరి నెలలో ధరలు బాగా పడిపోగా.. రైతులు ఖర్చును కూడా తిరిగి పొందలేకపోయారు. మండిలో కిలో ఉల్లి రూ.1 నుంచి 2కు అమ్ముడు పోయింది. ఈ నేపథ్యంలో రైతులు ఉల్లిని రోడ్డుపై పడేయడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఉల్లి ధరలు పెరుగుతుండటంతో.. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.