NTV Telugu Site icon

PM Modi: ఒకేసారి ఎన్నికలు, యూనిఫాం సివిల్ కోడ్, అర్బన్ నక్సల్స్.. మోడీ పవర్ ఫుల్ స్పీచ్..

Pm Modi

Pm Modi

PM Modi: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. 149వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ గురువారం గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద నివాళులర్పించారు. ఈ సారి జాతీయ ఐక్యతా దినోత్సవం రోజు దీపావళి పండగ వచ్చిందని పీఎం మోడీ అన్నారు. దేశంలో ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ నిజం అవుతుందని ఆయన అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒకేసారి ఎన్నికలు ఉపయోగపడుతాయని అన్నారు. ప్రతిపక్షాలు ప్రస్తావిస్తూ.. రాజకీయాల కోసం కొన్ని శక్తులు జాతీయ ఐక్యతను బలహీనం చేయాలని ప్రయత్నిస్తున్నాయని, ఈ ‘‘అర్బన్ నక్సల్ కూటమి’’ని గుర్తించి పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Read Also: Narakasura Vadha: ఘనంగా దీపావళి వేడుకలు.. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోన్న ఒంగోలు వాసులు

దేశంలో ‘‘వన్ నేషన్-వన్ సివిల్ కోడ్’’ అడుగులు వేస్తుందని చెప్పారు. ఇది సెక్యులర్ సివిల్ కోడ్ అని ఆయన అన్నారు. దీపావళి దేశాన్ని వెలిగించడమే కాకుండా, ప్రపంచ దేశాలతో అనుసంధానిస్తోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో దీపావళిని జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370ని బీజేపీ రద్దు చేసిన విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. గత ప్రభుత్వాలు వివక్షాపూరిత విధానాలు, ఉద్దేశాలతో జాతీయ ఐక్యతను బలహీనపరిచాయని దుయ్యబట్టారు.

‘‘మేము జీఎస్టీ ద్వారా ఒక దేశం-ఒక పన్ను విధానాన్ని తీసుకువచ్చాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా ‘ఒక దేశం, ఒక ఆరోగ్య బీమా’ పథకాన్ని తీసుకువచ్చాము. ఇప్పుడు, మేము ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి, వనరులను ఆప్టిమైజ్ చేసే ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ దిశగా పని చేస్తున్నాము. భారతదేశం కూడా ‘ఒక దేశం, ఒకే సివిల్ కోడ్’ దిశగా పయనిస్తోంది.’’ అని అన్నారు. రాజ్యాంగాన్ని జపించే వారు కూడా రాజ్యాంగాన్ని అవమానించారని పరోక్షంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. 70 ఏళ్లుగా బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కానీ జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేశామని చెప్పారు. ఇప్పుడు అక్కడి సీఎం భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.