Kanwar Yatra: కన్వర్ యాత్రపై సోనూసూద్ పోస్ట్.. ‘‘హలాల్’’తో రిప్లై ఇచ్చిన కంగనా రనౌత్..
- కన్వర్ యాత్రపై ట్వీట్ చేసిన సోనూసూద్..
- ‘‘హలాల్’’ రిఫ్లై ఇచ్చిన కంగనా రౌత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanwar Yatra: ఉత్తర్ ప్రదేశ్‌లో ‘కన్వర్ యాత్ర’కి పోలీసులు పెట్టిన రూల్స్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ నిబంధనలపై విరుచుకుపడుతున్నాయి. ముజఫర్ నగర్ జిల్లా నుంచి సాగే ఈ యాత్రా మార్గంలో షాపులు, హోటళ్లు ఇతర దుకాణాల యజమానులు వారి పేర్లను ప్రదర్శించాలని పోలీసులు చెప్పారు. ఇప్పుడు ఇదే వివాదాస్పదమైంది. ప్రియాంకాగాంధీ ఈ రూల్స్‌ని రాజ్యాంగపై దాడిగా అభివర్ణించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వీటిని దక్షిణాఫ్రికా ‘వర్ణవివక్ష’, హిట్లర్ నాజీ రూల్స్‌గా విమర్శించారు. జావెద్ అక్తర్ వంటి వారు రూల్స్‌ని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే, ఈ నిబంధనలపై యాక్టర్ సోనూ సూద్ ట్వీట్ చేశారు. షాపుల నేమ్ ప్లేట్‌పై ‘మానవత్వం’ మాత్రమే ప్రదర్శించాలని పోస్ట్ చేశారు. అయితే, దీనిపై ఎంపీ, బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ స్పందించారు. సోనూసూద్ వైఖరిపై స్పందించిన కంగనా ‘‘ అంగీకరిస్తున్నాను. హలాల్ స్థానంలో ‘మానవత్వం’ ’’ అని ట్వీట్ చేశారు.
Also Read
Read Also: Minister Ravi Kumar: ఏపీలో భారీ వర్షాలు.. విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
అంతకుముందు బాలీవుడ్ పాటల రచయిత జావెద్ అక్తర్ స్పందిస్తూ.. “ముజఫర్‌నగర్ యుపి పోలీసులు సమీప భవిష్యత్తులో ఒక నిర్దిష్ట మతపరమైన ఊరేగింపు జరిగే మార్గంలో అన్ని దుకాణాలు రెస్టారెంట్లు మరియు వాహనాలు కూడా యజమాని పేరును ప్రముఖంగా మరియు స్పష్టంగా చూపించాలని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకు? జర్మన్లో నాజీలు దుకాణాలు, ఇళ్లపై ప్రత్యేక గుర్తు ఉంచేవారు’’ అని ట్వీట్ చేశారు.
శుక్రవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. యాత్రికుల విశ్వాసం, పవిత్రతను కాపాడేందుకు కన్వర్ మార్గాల్లో ఆహారం, పానీయాలు అమ్మే దుకాణాల యజమానులు పేర్లను ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ రూల్స్‌పై ముజఫర్ నగర్ పోలీసుల స్పందిస్తూ.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
There should be only one name plate on every shop : “HUMANITY” 🇮🇳
— sonu sood (@SonuSood) July 19, 2024
Agree, Halal should be replaced with “ HUMANITY” https://t.co/EqbGml2Yew
— Kangana Ranaut (@KanganaTeam) July 19, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు