NTV Telugu Site icon

Savarkar Row: శరద్ పవార్ మధ్యవర్తిత్వం.. సావర్కర్‌ను విమర్శించనని రాహుల్ గాంధీ హామీ..

Rahul Gandhi

Rahul Gandhi

Savarkar Row: రాహుల్ గాంధీ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘‘నా పేరు సావర్కర్ కాదు, నాపేరు గాంధీ.. నేను ఎవరికి క్షమాపణలు చెప్పను’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇటు బీజేపీతో పాటు అటు ఉద్దవ్ ఠాక్రే వర్గం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాము సావర్కర్ ను అభిమానిస్తామని, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించారు. దీంతో మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి మధ్య విబేధాలు తలెత్తాయి.

Read Also: Harish Rao: మూడో స్థానంలో ఉన్నాం.. మొదటి స్థానానికి వెళ్లాల్సిన అవసరం ఉంది

కాంగ్రెస్, ఉద్దవ్ వర్గం మధ్య అగాధం పెరగకుండా ఎన్సీపీ నేత శరద్ పవార్ ఇరు పార్టీల మధ్య మధ్యవర్తిత్వం వహించారు. సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏర్పాటు చేసిన విపక్ష నేతల సమావేశంలో పవార్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇలాంటి వ్యాఖ్యల ప్రతిపక్షాల ఐక్యతకు సాయం చేయవని కాంగ్రెస్ ముఖ్యలుకు తెలిపారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. సావర్కర్ ఎప్పుడూ ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడు కాదని రాహుల్ గాంధీకి శరద్ పవార్ చెప్పారు.

ప్రతిపక్షాల నిజమైన పోరాటం బీజేపీ, ప్రధాని మోదీపై అని చెప్పారు. సావర్కర్‌ను లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఖర్గే ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకాలేదు. ఇదిలా ఉంటే పవార్ సూచన మేరకు రాహుల్ గాంధీ మరోసారి సావర్కర్ ను దూషించనని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.