Site icon NTV Telugu

Misfire: పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీస్ స్టేషన్‌కి మహిళ.. తుపాకీ మిస్‌ఫైర్..

Up

Up

Misfire: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పాస్‌పోర్టు వెరిఫికేషన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మహిళ అనూహ్యంగా మరణించింది. అదే సమయంలో ఓ అధికారి చేతుల్లో ఉన్న తుపాకీ మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ మహిళకు తాకడంతో అక్కడే నేలపై పడిపోయింది యూపీలోని అలీఘర్ పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇష్రత్ అనే మహిళను ఆస్పత్రికి తరలించారు, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం 2.50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నిందితుడైన పోలీస్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Big Breaking: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు లైన్ క్లియర్

అయితే పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో అధికారి డబ్బుకోసం మహిళను వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో వాగ్వాదం జరగడంతో ఆ అధికారి ఆమెను షూట్ చేశారని, కుటుంబం తెలిపింది. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం ఆమె పోలీస్ స్టేషన్ వెళ్లిందని, డబ్బు కోసం కాల్స్ వస్తున్నాయని, ఆమెను ఎవరు కాల్చారో తెలియదని మహిళ బంధువు జీషన్ చెప్పారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇన్‌స్పెక్టర్ మనోజ్ శర్మను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. గాయపడిన బాధితురాలకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన అంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డైంది. దీని ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ తల వెనక భాగంలో గాయమైందని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బాధిత మహిళ ఉమ్రా, మినీ తీర్థయాత్ర కోసం సౌదీ అరేబియా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటుందని బంధువులు తెలిపారు.
https://twitter.com/ShivAroor/status/1733112917426680100

Exit mobile version