NTV Telugu Site icon

Omar Abdullah: రేపు జమ్మూకాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం..

Omar

Omar

Omar Abdullah: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వైఎస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా రేపు (బుధవారం) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తదుపరి సర్కార్ ఏర్పాటు చేసేందుకు తనకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌ సిన్హా నుంచి ఆహ్వాన లేఖ అందిందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన తెలిపారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఒమర్‌ను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు.

Read Also: Very Heavy Rains in AP: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో సెలవు

కాగా, 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్‌కు 6 సీట్లు వచ్చాయి.. బీజేపీ 29 స్థానాల్లో గెలిచింది. ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వగా.. దీంతో భారతీయ జనతా పార్టీ బలం 32కు చేరింది. అలాగే, మరో నలుగురు స్వతంత్ర్య అభ్యర్థులు కూడా ఒమర్ అబ్దుల్లా పార్టీకి సపోర్ట్ తెలపడంతో ఆ పార్టీ బలం 46కి చేరిపోయింది. దీంతో కాంగ్రెస్ సహాయం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీని ఎన్సీ పార్టీ దక్కించుకుంది.