Site icon NTV Telugu

Omar Abdullah: ఇండియా కూటమి ‘‘వెంటిలేటర్’’పై ఉంది.. కాంగ్రెస్ పక్షాల ఆగ్రహం, బీజేపీ హ్యాపీ..

Omar Abdullah

Omar Abdullah

Omar Abdullah: ఇండియా కూటమి పరిస్థితిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ మిత్రపక్షాల్లో ఆందోళన పెంచాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి ‘‘లైఫ్ సపోర్ట్‌పై ఉంది’’ అని అన్నారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్లో ప్రతిపక్ష కూటమి గురించి మాట్లాడుతూ.. ‘‘ మనం లైఫ్ సపోర్ట్‌లో ఉన్నట్లే. కానీ కొన్నిసార్లు వైద్యులు షాక్ ఇస్తారు, ఆ తర్వాత మనం మళ్లీ లేస్తాము. కానీ , దురదృష్టవశాత్తు బీహార్ వంటి ఫలితాలు రావడంతో మళ్లీ పడిపోతాము. అప్పుడు ఎవరో మనల్ని ఐసీయూకి తీసుకెళ్లాలి’’ అని అన్నారు. ఇండియా బ్లాక్ నితీష్ కుమార్‌ను ఎన్డీయే వైపు తిరిగి పంపించిందని, బీహార్ సీటు షేరింగ్‌లో హేమంత్ సొరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తీమోర్చాను చేర్చలేదని ఆయన అన్నారు.

Read Also: Pakistan-Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు అంతర్జాతీయంగా ఘోర అవమానం..

అయితే, ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు ఇండియా కూటమిలోని పార్టీల నేతలకు ఆగ్రహాన్ని తెప్పించాయి. మరోవైపు, బీజేపీ మాత్రం ఆయన కామెంట్స్‌తో హ్యాపీగా ఉంది. ఆర్జేడీ నేత మనోజా మాట్లాడుతూ.. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు హస్యంగా ఉన్నాయంటూ విమర్శించారు. కాంగ్రెస్ నేత మనోజ్ కుమార్ పరిస్థితి చేయి దాటకుండా మాట్లాడారు. అబ్దుల్లా ఇండీ కూటమిలోనే ఉన్నట్లు చెప్పారు. ఆయన వ్యాఖ్యలు కూటమి బలం పెంపొందించడానికి అని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు రాహుల్ గాంధీని విశ్వసిస్తారని, అందుకే అబ్దుల్లాకు ఘన విజయం దక్కిందని చెప్పారు. మరోవైపు, బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్.. ఇండియా అలయన్స్ చనిపోయిందని, దానికి విధానాలు, నేతృత్వం లేదని చెప్పారు.

Exit mobile version