NTV Telugu Site icon

IAS Pooja Khedkar: తుపాకీతో రెచ్చిపోయిన ట్రైనీ ఐఏఎస్ పూజా తల్లి.. వీడియో వైరల్

Gue

Gue

ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవ్వగా.. తాజాగా ఆమె తల్లి మనోరమా ఖేద్కర్ యవ్వారం మరింత రచ్చ చేస్తోంది. తుపాకీ పట్టుకుని పొలంలో ఓ రైతును బెదిరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బౌన్సర్లను వెంటపెట్టుకుని రౌడీలా రెచ్చిపోతూ నానా హంగామా సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Madhya Pradesh: భర్తతో గొడవ.. 2 ఏళ్ల కుమార్తెని నీటిలో ముంచి చంపిన తల్లి..

పూణెలోని ముల్షీ తాశీల్‌లో 25 ఎకరాల భూమిని ఖేద్కర్ కుటుంబం కొనుగోలు చేసింది. ఆ క్రమంలో పక్కనున్న రైతుల భూమి సైతం ఆ భూమిలో కలిపేసింది. ఆ భూమి యజమాని అయిన రైతు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బౌన్సర్‌ని వెంటపెట్టుకుని మనోరమా.. వ్యవసాయ భూమి దగ్గరకు వచ్చి తుపాకీతో బెదిరింపులకు పాల్పడింది.  అయితే ఈ వ్యవహారం కోర్టులో ఉందని మనోరమకు రైతు గుర్తు చేశారు. ఈ భూమి నిజమైన యజమానివి నివేనా? కానీ ఈ స్థలం తన పేరు మీద ఉందని అతడికి తెలిపింది. అయినా ఈ వ్యవహారం కోర్టులో ఉంటే ఏమిటి? నేను ఎవరికీ భయపడనంటూ అతడికి సమాధానం ఇచ్చింది. దీంతో కోర్టు నిర్ణయం ఇప్పడప్పుడే రాదని రైతు పేర్కొనగా.. అయితే ఈ భూమికి అసలు యజమానిని నేనేనంటూ మనోరమ పేర్కొంది. ఈ ఘటన గతేడాది 2023లో జరిగినట్లు సమాచారం. పూజా ఖేద్కర్ వ్యవహారం మీడియాలో రచ్చ రచ్చ అవ్వడంతో తాజాగా తల్లి వీడియో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఖేద్కర్ ఫ్యామిలీకి మహారాష్ట్రలో భారీగా ఆస్తులున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. తండ్రికి అఫీషియల్ గా రూ.70 కోట్లు, పూజా ఖేద్కర్ పేరున రూ.22 కోట్ల ఆస్తులు ఉన్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది.

ఇది కూడా చదవండి: James Anderson: విజయంతో కెరీర్ ముగించిన జేమ్స్ అండర్సన్..

అధికార దుర్వినయోగానికి పాల్పడినందుకుగాను మహారాష్ట్ర ప్రభుత్వం పూజా ఖేద్కర్‌ను వాషిమ్‌కు బదిలీ చేసింది. అయితే ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ సైతం రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అధికారి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా ఆయన పోటీ చేశారు. తన ఆస్తి రూ. 40 కోట్లు ఉందంటూ ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. అయితే పూజా ఖేద్కర్ ఓబీసీ రిజర్వేషన్‌తో పాటు అంధత్వం, మానసికి వైకల్యం కోటాలో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. పూజా గొంతెమ్మ కోర్కెలు కోరడానికి ప్రధాన కారణం తండ్రి దిలీప్‌నే కారణమని తెలుస్తోంది. కలెక్టరేట్‌కు వెళ్లి అధికారుల్ని బెదిరించినట్లుగా సమాచారం.

పూజా యవ్వారం బయటకు రావడంతో ఆ కుటుంబంలోని వ్యక్తుల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంకో వైపు ట్రైనీ ఐఏఎస్ పూజాపై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆమె వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఏక సభ్య కమిటిని నియమించింది. ఈ అంశంపై రెండు వారాల్లో నివేదిక అందజేయాలని సదరు కమిటీని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.