Site icon NTV Telugu

Viral Video: విడుదలైన ఖైదీకి గ్రాండ్ ఫేర్‌వెల్ ఇచ్చిన జైలు సిబ్బంది.. వీడియో వైరల్..

Uttar Pradesh

Uttar Pradesh

Viral Video: అయోధ్య జైలు నుంచి విడుదల అయిన 98 ఏళ్ల వృద్ధుడికి ఘనంగా వీడ్కోలు చెప్పారు జైలు సిబ్బంది. ఇతరులతో గొడవ పడిన కారణంగా ఐపీసీ 452, 323, 352 సెక్షన్ల కింద 98 ఏళ్ల రామ్ సూరత్ అనే వ్యక్తికి జైలు శిక్ష విధించారు. ఐదేళ్ల పాటు ఆయన జైలులో శిక్ష అనుభవించారు. తాజాగా విడుదల అయ్యారు. విడుదల సమయంలో జైలు సిబ్బంది రామ్ సూరత్ కు ఘనంగా వీడ్కోలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. యూపీ జైళ్ల శాఖ డీజి ట్విట్టర్ లో దీన్ని పోస్ట్ చేశాడు. అతడిని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదని, రామ్ సూరత్‌ను పోలీసులు అతని ఇంటి వద్ద దింపుతారని అయోధ్య జైలు జిల్లా సూపరింటెండెంట్ శశికాంత్ మిశ్రా పుత్రావత్ చెప్పడం కనిపిస్తుంది. మిశ్రా వృద్ధుడిని కారు వద్దకు తీసుకెళ్లడం ఇందులో కనిపిస్తుంది.

Read Also: Cold Wave: చలి గుప్పిట ఢిల్లీ..1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. స్కూళ్లు బంద్..

సూరత్ ఆగస్ట్ 8, 2022న విడుదల కావాల్సి ఉంది, కానీ మే 20, 2022న అతనికి కోవిడ్-19 ఉన్నట్లు నిర్ధారణ అయింది. తాజాగా ఇప్పుడు విడుదలయ్యారు. ఈ వీడియోను ట్విట్టర్ లో 2 వేల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన వారంతా పలు కామెంట్లు చేస్తున్నారు. ‘‘98 ఏళ్ల వృద్ధుడిని జైలులో ఉంచడం సమర్థనీయం లేదా మానవత్వం కాదని న్యాయం మరియు శాంతిభద్రతలు సిగ్గుపడాలి’’ అని కామెంట్ చేశారు. మరొకరు ‘‘నా భావాలను వ్యక్తీకరించడానికి నాకు పదాలు లేవు. చాలా అద్భుతమైన క్షణం’’ అని రిఫ్లై ఇచ్చారు.

Exit mobile version