NTV Telugu Site icon

Triple Talaq: సైబర్ ఫ్రాడ్‌లో మోసపోయిన భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..

Odisha

Odisha

Triple Talaq: సైబర్ మోసాల పట్ల ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసిన ఎక్కడో చోట ప్రజలు అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు. విదేశాల నుంచి గిఫ్టులు పంపిస్తామని, లాటరీ తగిలిందని చెబుతూ జనాలను మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సైబర్ మోసం 15 ఏళ్ల వివాహబంధానికి తెరపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే ఒడిశాకు చెందిన ఓ మహిళ రూ. 1.5 లక్షలను సైబర్ మోసంలో పోగొట్టుకుంది. ఇది తెలిసిన భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు.

Read Also: Israel: ఇజ్రాయిల్ పై సిరియా దాడి.. సరిహద్దు దేశాల నుంచి వరస దాడులు..

కేంద్రపర జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ జమ్రున్ బీబీకి ఫేస్ బుక్ ద్వారా రవి వర్మ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం స్నేహంగా మారింది. అక్క అని పిలుస్తూ తనది జార్ఖండ్ అని, ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉంటున్నానని నమ్మించారు. ఈ మాటలను జమ్రున్ బీబీ నమ్మింది. ఈ నేపథ్యంలో ఆమెకు రూ. 25 లక్షల విలువైన బంగార కంఠహారం, ఫ్రిడ్జ్, ఐఫోన్, ఏసీ వంటి ఖరీదైన వస్తువులను పంపుతాని అని నమ్మబలికాడు. వాటిని పంపేందుకు దాదాపుగా రూ.1.70 లక్షలు కొరియర్ ఛార్జీలు అవుతాయని నమ్మించాడు. ఈ మాటలను నమ్మిన మహిళ తన నెక్లెస్ తాకట్టు పెట్టి రూ. 60 వేలు పంపింది. మరో విడతగా రూ. 1,70,000లను రవి వర్మకు అందించింది. అయితే ఈ డబ్బు అందిన తర్వాత మాట్లాడటం మానేశాడు రవివర్మ.

తాను మోసపోయాని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న గుజరాత్ లో ఉన్న భర్త రజీద్.. ఫోన్లోనే జమ్రున్ కు ట్రిపుల్ తలాక్ చెప్పారు. దీంతో వీరిద్దరి 15 ఏళ్ల వివాహ బంధానికి తెరపడింది. జమ్రున్ కు ఇద్దరు టీనేజ్ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారు. ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు 45 ఏళ్ల రజీద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 2017లో కేంద్ర ప్రభుత్వం భారత దేశంలో ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసింది.