చదువుకు, వయస్సుకు సంబంధం లేదని ఇటీవల కొందరు నిరూపిస్తున్నారు కృష్టి, పట్టుదల ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని వయసు మీద పడిన పలువురు వ్యక్తులు నిరూపించారు. తాజాగా మరోసారి నిరూపించారు ఒడిశా కంధమాల్ జిల్లా పుల్బాని ఎమ్మెల్యే(బీజేడీ) అంగద కన్హార్. 58 ఏళ్ల వయస్సులో పదో తరగతి పరీక్ష రాయడమే కాకుండా, అందులో ఉత్తీర్ణత సాధించి అందరిచే శభాష్ అనిపించుకున్నారు ఎమ్మెల్యే. దాంతో పాటు తన కోరికను నెరవేర్చుకున్నారు.
ఒడిశా కంధమాల్ జిల్లా పుల్బాని ఎమ్మెల్యే(బీజేడీ) అంగద కన్హర్ పదోతరగతి పాస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వయసు 58ఏళ్లు కాగా.. 1978లో ఆయన చదువు ఆపేశారు. ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు పొందారు. రాజకీయ నాయకుడిగా తనకంటూ గుర్తింపు పొందిన ఎమ్మెల్యేకు ఎప్పటి నుంచో పదో తరగతి పూర్తి చేయాలని ఉండేది. ఈ క్రమంలోనే ఇటీవల ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ నిర్వహించిన పరీక్షలు రాశారు. ఆ ఫలితాలు వచ్చేశాయి. ఎమ్మెల్యే అంగాడ టెన్త్ పరీక్షల్లో పాసయ్యారు. ఫలితాల్లో ఆయన బీ1 గ్రేడ్ సాధించారు. 500 మార్కులకు గాను 364 మార్కులు తెచ్చుకున్నారు. చదువుకి వయసుతో సంబంధం లేదని ఆయన మరోసారి నిరూపించారు.
1978లో పదో తరగతి దాకా వెళ్లిన ఆయన.. కుటుంబ సమస్యలతో పరీక్షకు హాజరు కాలేకపోయాడట. అయితే వయసు పైబడిన వాళ్లెందరో.. బిడియాన్ని పక్కనపెట్టి పరీక్షలకు హాజరవుతుండడం తాను గమనించానని, అందుకే తాను తన విద్యను పూర్తి చేయాలనుకుంటున్నానని అంగద చెప్తున్నారు. పైగా చదువుకుంటే పెరిగేది జ్ఞానమే కదా.. సిగ్గుపడాల్సిన అవసరం ఎందుకు? అంటున్నాడు. అయితే పరీక్ష ఆయన ఒక్కడే రాశాడు అనుకోకండి. తోడుగా ఆయన పాత స్నేహితులు ఇద్దరు కూడా పరీక్షలకు హాజరుకాగా, అందులో ఓ పెదదాయన ఒక ఊరికి సర్పంచ్ కూడా. ఇక.. ఆ స్కూల్ ఎగ్జామ్ సెంటర్‌లో మధ్యలో చదువు ఆపేసిన వాళ్లు చాలామందే ఎగ్జామ్ రాశారట. అందులో అత్యధిక వయస్కుడు అంగదనే కావడం గమనార్హం.
BJP: సీఎం కేసీఆర్‌కి వ్యతిరేకంగా సాలుదొర – సెలవుదొర
రుజంగి పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో కలిసి ఏప్రిల్ 29న ఆయన పదోతరగతి పరీక్షలు రాశారు. వాటి ఫలితాలు రాగా ఆయన ఉత్తీర్ణత సాధించినట్లు తెలిసింది. టెన్త్ పరీక్షల్లో పాస్ అయినట్టు తెలియగానే ఆ ఎమ్మెల్యే ఆనందంతో పొంగిపోయారు. వెంటనే గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. టెన్త్ పరీక్షల్లో పాస్ అయిన ఎమ్మెల్యేను ఆయన సహచరులు, స్నేహితులు, స్థానికులు అభినందనలతో ముంచెత్తారు. పదోతరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు తనను ప్రోత్సహించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా చదువును కొనసాగిస్తానని ఆయన చెప్పారు. చదువుకు, వయస్సుకు సంబంధం లేదని ఆయన వెల్లడించారు.
ఎమ్మెల్యే వయసు ప్రస్తుతం 58ఏళ్లు. సాధారణంగా రిటైర్ అయ్యే వయసు అది. కానీ, ఎమ్మెల్యే అంగద మాత్రం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు.1985లో క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన అంగద కన్హర్.. వరుసగా 3సార్లు కెరండిబాలి పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందారు. మరో సారి పొకారి పంచాయతీ నుంచి ఎన్నికయ్యా రు. పంచాయతీరాజ్ వ్యవస్థలో అంచెలంచెలుగా ఎదిగారు. ఫిరింగియా మండల అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ సభ్యుడిగా ప్రజాభిమానాన్ని సంపాదించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం పుల్బాణి నుంచి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేసి, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా కారణంగా పరీక్షలు జరగక పోవడంతో రాయలేక పోయానని చెప్పిన ఎమ్మెల్యే.. ఇటీవల ఇద్దరు మిత్రులతో కలిసి పరీక్ష రాయగా.. వీరిలో ఒకరు స్థానిక సర్పంచ్ కావడం గమనార్హం.
Nallari Kishore Kumar Reddy: పెద్దిరెడ్డికి నా సవాల్.. జగన్ బొమ్మ లేకుండా గెలిచే దమ్ముందా..?