Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట చేశారు. శతాబ్ధాల కల ఈ రోజు నెరవేరిందని రామ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా పలువురు వివిధ చర్యల ద్వారా రామ భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఒడిశాకు చెందిన చేనేత కుటుంబం ‘రామాయణ గాథ’తో చీరను తయారు చేశారు. ఇది చూపరులను ఆకట్టుకుంటుంది.
Read Also: Pakistan: రామ మందిరంపై పాకిస్తాన్ అసూయ..ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ పోస్ట్..
రామాయనంలోని రామసేతు గాథను వర్ణించే విధంగా చిత్రీలను చీరపై నేశారు. ఈ చీర తయారీలో పూర్తిగా పర్యావరణ అనుకూల పదార్థాలను వినియోగించారు. ఇది ‘ఒకే భూమి-ఒకే కుటుంబం’ అనే సందేశాన్ని ఇస్తుందని తయారీదారులు తెలిపారు. సంబల్‌పూర్‌కి చెందిన కుటుంబం ఈ చీరను తయారు చేసింది. దుష్యంత్ మెహర్ కుటుంబం గత శతాబ్ధాలుగా చేనేత తయారీలో ఉంది. రామ మందిర వేడుకల కోసం కుటుంబ సభ్యులు మూడు నెలల పాటు చీరను సిద్ధం చేవారు. 2015లో జాతీయ అవార్డు గెలుచుకున్న దుష్యంత్ తండ్రి ఈశ్వర్ మెహర్ ఈ విశిష్టమైన చీర వెనక ఉన్న మాస్టర్ మైండ్. ఈ చీరను టై-డై పద్ధతితో తయారు చేసినట్లు వెల్లడించారు. చీరపై రామసేతు నిర్మాణాన్ని వర్ణించారు. సుగ్రీవుడు, హనుమాన్, వానర సైన్యం చిత్రాలు దీనిపై ఉన్నాయి. ఢిల్లీలోని జగన్నాథ దేవాలయం హౌజ్ ఖాస్‌లో మేకర్స్ ప్రత్యేక చీరను ప్రదర్శించారు. రామ నవమి సందర్భంగా రాముడి ఆశీర్వాదం కోసం ఈ చీరను అయోధ్యకు తీసుకెళ్తానని దుష్యంత్ చెప్పారు. పూలు, బెల్లం, శనగపిండి వంటి సహజ రంగుల్ని చీర అద్దకంలో వాడినట్లు తెలిపారు.
