Nupur Sharma: నుపుర్‌శర్మ, నవీన్ జిందాల్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని రోజుల క్రితం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో భాజపా జాతీయ అధికారి ప్రతినిధి నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఢిల్లీ మీడియా విభాగ బాధ్యుడు నవీన్ జిందాల్ అభ్యంతరకరమైన రీతిలో ట్విటర్లో స్పందించడం ఇటీవల తీవ్ర దుమారానికి తెరలేపిన విషయం తెలిసిందే. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన భాజపా.. నుపుర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత నుపుర్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా తెలిపారు.
అయితే, అప్పటికే వీరి వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. తమ మత విశ్వాసాలను కించపరిస్తే సహించేది లేదని ఇస్లామిక్ దేశాలు మండిపడుతున్నాయి. కొన్ని దేశాల్లో భారతీయ ఉత్పత్తుల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చే స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. కువైట్‌లోని ఓ స్టోర్‌లో భారతీయ ఉత్పత్తులను ఒక చోట పోగేసి ఆ వస్తువులను బహిష్కరిస్తున్నట్లు బోర్డులు కూడా పెట్టడం గమనార్హం.
Biotech Startup Expo: నేడు బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పో-2022ను ప్రారంభించనున్న ప్రధాని
Also Read
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను వ్యాప్తి చేసి ప్రజల ప్రశాంతతకు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ భంగం కలిగించారని వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు బుధవారం వారిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, షాదాబ్ చౌహాన్, సబా నఖ్వీ, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్ మీనా, పూజా షకున్‌లపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అనేక మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, దేశంలో అశాంతిని సృష్టించే ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కూడా దర్యాప్తు చేస్తామని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజావార్తలు
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!