NPS: ఉద్యోగులకు 45 శాతం పెన్షన్.. కేంద్రం క్లారిటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తుంది.. తాజాగా మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఉద్యోగుల కు అధిక పెన్షన్ వచ్చేలా నిర్ణయం తీసుకోబోతోందని రాయిటర్స్ కథనం ప్రచూరించిన విషయం తెలిసిందే. ఉద్యోగులు తాము చివరగా అందుకున్న వేతనంలో 45 శాతం వరకు పెన్షన్ ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో దీనిపైనే అనేక చర్చలు జరుగుతున్నాయి. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో మార్పులు చేసిన అధిక పెన్షన్ అందించనున్నారనే వార్తలపై తాజాగా కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది.. ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది..
ఈ స్కీమ్ గురించి ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది.. ఇంకా ఎలాంటి నిర్ధరాణలకు రాలేద ని ట్విట్టర్ ద్వారా కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద ఉద్యోగుల కోసం ప్రభుత్వం నిర్దిష్ట శాతం పెన్షన్‌ను ప్రతిపాదించబోతోందన్న వార్తల్లో నిజం లేదని, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకో లేదని స్పష్టం చేసింది. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సెషన్‌లో లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన కు అనుగుణంగా ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది.. అయితే వాటా దారులకు సంప్రదించే ప్రక్రియలో ఉంది. కమిటీ ఇంకా ఎలాంటి నిర్ధారణలకు రాలేదని ట్విట్టర్‌లో స్వయంగా పేర్కొంది..
Also Read
- Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
ఇది ఇలా ఉండగా.. ఉద్యోగులు, ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ఇస్తున్నప్పటికీ, ఉద్యోగులు వారి చివరి వేతనంలో 40 నుంచి 45 శాతం పింఛన్ పొందుతారని పేర్కొంది. ఎన్‌పీఎస్ ప్రకారం ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనం లో 10 శాతం, ప్రభుత్వం 14 శాతం చొప్పున ఈ స్కీమ్‌లో జమ చేయాలి. చివరికి చెల్లింపు అనేది ఆ కార్పస్‌పై మార్కెట్ రిటర్న్స్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ లో ఒక ఉద్యోగి చివరగా డ్రా చేసిన వేతనంలో 50 శాతం స్థిరమైన పెన్షన్ లభిస్తుంది.. త్వరలోనే ఈ విషయం పై మరో ప్రకటన వెలువడనుందని సమాచారం..
తాజావార్తలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
-
Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!