NTV Telugu Site icon

Delhi Acid Attack: ఫ్లిప్‌కార్ట్‌లో యాసిడ్ కొన్న నిందితుడు.. అమెజాన్, ఫ్లిప్‌కార్టుకి DCW నోటీసులు

Delhi Acid Attack

Delhi Acid Attack

Delhi Acid Attack: ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో 17 ఏళ్ల అమ్మాయిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు నిందితుడు. బుధవారం ఉదయం రోడ్డుపై చెల్లితో నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిపై ఇద్దరు నిందితులు బైక్ పై వచ్చి ముఖంపై యాసిడ్ తో దాడి చేశారు. ఈ కేసులో బాధితురాలుకు తెలిసిన ఇద్దరు వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన వివరాలతో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు సంచలన విషయాలు వెల్లడించాడు. దాడికి ఉపయోగించిన యాసిడ్ ను ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపాడు.

Read Also: Live In Relation: కేరళ శ్రద్ధా వాకర్‌గా సింధు.. యువతిని నరికి చంపిన లవర్

ఈ దాడిలో బాలిక ముఖం, మెడపై 8 శాతం కాలిన గాయాలు అయినట్లు వైద్యులు వెల్లడించారు. బాధితురాలు 12 తరగతి చదువుతోంది. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉంది. కాలిన గాయాలు ఎంత వరకు చర్మంపై ప్రభావం చూపించాయనే విషయం నిర్థారించేందుకు 48 నుంచి 72 గంటల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రధాన నిందితుడు సచిన్ అరోరా, బాలికతో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అయితే మూడు నెలల క్రితం వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. దీంతో బాలికపై పగ పెంచుకున్న సచిన్ తన ఇద్దరు మిత్రులు హర్షిత్, వీరేంద్రలతో కలిసి దాడికి ప్లాన్ చేశారు. ఫ్లిప్‌కార్ట్ నుండి ఆన్‌లైన్‌లో యాసిడ్‌ను ఆర్డర్ చేసాడు.

ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్(DCW) సీరియస్ అయింది. బాధితురాలికి న్యాయం చేయాలని కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఆన్లైల్ లో యాసిడ్ అమ్మకాలపై ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు నోటీసులు జారీ చేసింది. యాసిడ్‌ దాడులు పెరగడంతో యాసిడ్‌ విక్రయాలపై 2013లో సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అయినా అమ్మకాలు జరుగుతుండటంపై సీరియస్ అయింది. కూరగాయలు కొనుగోలు చేసినంత సులువుగా యాసిడ్ లభిస్తుందని ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మలివాల్ వ్యాఖ్యానించారు.

Show comments