Site icon NTV Telugu

US-China tariff War: అమెరికా-చైనాల మధ్య సుంకాల గొడవ.. ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం: ఎస్. జైశంకర్

Jai Shankar

Jai Shankar

US-China tariff war: అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. దీంతో ప్రపంచం తీవ్ర గందరగోళానికి గురైతుంది. ఇక, ఈ వివాదంపై న్యూఢిల్లీలో జరిగిన కార్నెగీ ఇండియా గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్‌లో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. రెండు అతి పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మధ్య టిట్-ఫర్-టాట్ టారిఫ్ వార్ కొనసాగుతుంది.. ఇకపై ఏదీ పూర్తిగా వ్యాపారం కాదు.. ప్రతిదీ కూడా వ్యక్తిగతమైనదని అన్నారు. భారత్ సహా పలు దేశాలపై విధించిన సుంకాలను తాత్కాలికంగా 90 రోజుల పాటు సడలించిన చైనాపై మాత్రం 145 శాతం టారిఫ్ లను విధిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఈ చర్య ప్రపంచ స్టా్క్ మార్కెట్లను కుదిపివేసింది.. భారీ సుంకాలను ఎదుర్కొంటున్న బీజింగ్, తనదైన రీతిలో స్పందిస్తూ.. చివరి వరకు పోరాడతామని ప్రతిజ్ఞ కూడా చేసింది.. గతంలో ఈ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను భారతదేశం నావిగేట్ చేసిందని కేంద్రమంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు.

Read Also: Bhumana Karunakar Reddy: ఎస్వీ గోశాల గోవధ శాలగా మారింది.. ఇది చంద్రబాబు, పవన్ చేసిన పాపమే..!

ఇక, జనవరి 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగాఅధికారం చేపట్టిన వెంటనే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం వాషింగ్టన్‌తో చర్చలను వేగవంతం చేశామని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు. కానీ, ట్రంప్ తన మొదటి పదవీకాలం సమయంలో వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చక పోవడంతో ఇండో- అమెరికా వాణిజ్య విధానంపై తీవ్రమవుతున్న అనిశ్చితి నెలకొందన్నారు. కాగా, ఇప్పుడు మాత్రం ఆ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ప్రయత్నిస్తోందని తేల్చి చెప్పారు. అయితే, ప్రస్తుతం అమెరికాలో ఆందోళనకర వాతావరణం నెలకొనడంతో.. చర్చల్లో వేగం తగ్గిపోయిందన్నారు. అయితే, యుఎస్-చైనా మధ్య సంబంధాలు చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక, 1947లో భారత్ కి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అమెరికా- చైనా మధ్య తీవ్రమైన పోటీ ఉండేది.. ఆ పోటీలో మేము చిక్కుకు పోయామన్నారు.. కాగా, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నది వాణిజ్యం, రాజకీయం, రక్షణ సమస్య కాదు.. ఇది చాలా సున్నితమైన అంశమని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు.

Exit mobile version