NTV Telugu Site icon

Gautam Gambhir: ఉచితాలకు పోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి..ఢిల్లీ ప్రజలు మేలుకోవాలి..

Delhi Floods

Delhi Floods

Gautam Gambhir: భారీ వర్షాలు, యుమునా నది మహోగ్రరూపంతో ఢిల్లీ నగరం అతలాకుతలం అవుతోంది. ఎన్నడూ లేనంతగా యమునా నది ఉప్పొంది ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఏ క్షణాల ఏ ప్రమాదం జరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు. గత 40 ఏళ్లకు పైగా రికార్డు స్థాయిలో వరదలతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజలను హెచ్చరించారు. విద్యాసంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. వర్షాలు తగ్గుముఖం పట్టి ఎగువన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలక కారణంగా యమునా నదీ ఉప్పొంగుతోంది.

Read Also: Telangana : దారుణం.. చికెన్ వండలేదని భార్యను గొడ్డలితో నరికిన భర్త..

ఇదిలా ఉంటే భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తాజా పరిస్థితులపై స్పందించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ప్రజలకు ఏదీ ఉచితంగా రాదని, ఉచితాల వైపు వెళ్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని, ఢిల్లీ ప్రజలు మేలుకోవాలని ట్వీట్ చేశారు. ‘‘ ఢిల్లీ ప్రజలారా మేలుకొండి.. రాజధాని నగరం మురికి కాల్వను తలపిస్తోంది. ఏదీ ఉచితంగా రాదు. ఈ మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అని పరోక్షంగా ఆప్ ఉచిత పథకాలను గురించి విమర్శించారు.

ఢిల్లీలో ఇలాంటి పరిస్థితులు రావడానికి ఆప్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని బీజేపీ విమర్శిస్తోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ఆప్ విఫలమైందని ఆరోపిస్తోంది. అయితే యమునా నదీ అంచనాలకు మించి ప్రవహిస్తుండటంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆప్ విమర్శించింది. ఢిల్లీలో వరదల నేపథ్యంలో నిన్న కేజ్రీవాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.