Site icon NTV Telugu

Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు.. రాత్రిపూట దాడులపై స్థానికులు ఏం చెబుతున్నారంటే..?

Jammu And Kashmir

Jammu And Kashmir

Jammu and Kashmir: పాక్‌-భారత్‌ సరిహద్దులు రాత్రంతా దద్దరిల్లిపోయాయి.. పాకిస్తాన్‌ ప్రతీ చర్యను బలంగా తిప్పికొట్టిండి భారత ఆర్మీ.. ఓవైపు భారత్‌ దాడులు, మరోవైపు బీఎల్‌ఏ దాడులతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.. అయితే, గురువారం రాత్రి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి.. ఇప్పుడు పరిస్థితి ఏంటి? భారత సైన్యంపై, ప్రధాని నరేంద్ర మోడీపై స్థానికులకు ఉన్న నమ్మకం ఏంటి? అనేది మనం వారి మాటల్లోనే తెలుసుకోవచ్చు.. అయితే, జమ్మూ కాశ్మీర్‌లో రాత్రి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినా.. ఉదయం పరిస్థితి సాధారణంగా ఉంది.. భారత వైమానిక రక్షణ విభాగాలు.. రాత్రిపూట పాకిస్తాన్ డ్రోన్‌లు మరియు క్షిపణులను అడ్డుకున్నాయి. పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రజల నివాస ప్రాంతాలపై దాడులకు పాల్పడింది.. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉన్న పాకిస్తాన్ సైన్యం.. ప్రజల కార్లను లక్ష్యంగా చేసుకుని కాల్పలకు తెగబడింది..

Read Also: Operation Sindoor Live Updates: శత్రుదేశాన్ని అష్టదిగ్బంధనం చేస్తున్న త్రివిధ దళాలు

జమ్మూ కాశ్మీర్‌లోని రాత్రి పరిస్థితి ఒక స్థానికుడు వివరిస్తూ.. నిన్న రాత్రి పూర్తిగా బ్లాక్‌అవుట్ జరిగింది. ఆ తర్వాత, డ్రోన్‌లు ఎగరడం ప్రారంభించాయి.. రాత్రంతా కాల్పులు కొనసాగాయని తెలిపారు.. అయితే మన (భారత) దళాలు పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇస్తున్నాయి. మన ప్రధానమంత్రి మరియు మన సైన్యంపై మాకు నమ్మకం ఉంది. అన్ని డ్రోన్‌లను మన దళాలు కట్టడిచేస్తున్నాయి.. మన దేశం గురించి మనకు గర్వంగా ఉంది. సరిహద్దు దగ్గర ఉద్రిక్తత ఉంది.. కానీ మిగిలిన ప్రదేశాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపాడు.. మరో వ్యక్తి మాట్లాడుతూ.. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో, మేము 3-4 డ్రోన్లను చూశాం.. ప్రతీకార కాల్పులు జరిగాయి, అది రాత్రంతా కొనసాగింది. పాకిస్తాన్ చేసింది సరైంది కాదన్నారు.. మేం భయపడటం లేదు.. ఆర్మీపై మాకు నమ్మకం ఉందన్నారు.. అయితే, ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో.. ఇక్కడ పాఠశాలలు మూసివేసినట్టు వెల్లడించారు..

Read Also: India-Pakistan War: పాకిస్థాన్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుళ్లు.. షరీఫ్‌ను తరలించిన పాక్ సైన్యం..

మరో స్థానికుడు మాట్లాడుతూ.. నిన్న రాత్రి మేం భోజనం చేద్దామని కూర్చున్నవెంటనే కొన్ని పేలుళ్ల శబ్దం వినిపించింది… తెల్లవారుజామున 4:30 గంటలకు మళ్లీ పేలుళ్లు వినిపించాయి, కానీ, మన దళాలు వాటిని కూడా తటస్థీకరించాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. భగవతి వైష్ణో దేవి జమ్మూలో కూర్చుంది, భయపడాల్సిన అవసరం లేదు… ప్రజలపై దాడి చేయడం పిరికితనం తప్ప మరొకటి కాదు ఎందుకంటే వారికి (పాకిస్తాన్) మన దళాలతో పోరాడే ధైర్యం లేదు. వారు చేయగలిగింది ఇదే.. మన దళాలు తగిన సమాధానం ఇస్తున్నాయి.. మేం మన దళాల చర్యల పట్ల గర్వపడుతున్నాం అని వెల్లడించారు..

Exit mobile version