NTV Telugu Site icon

BJP MLA: “కేదార్‌నాథ్‌లో హిందువులు కాని వారిని నిషేధించాలి”.. మరో వివాదం..

Asha Nautiyal'

Asha Nautiyal'

BJP MLA: కేదార్‌నాథ్ ఆలయంలోకి హిందువులు కానీ వారిని నిషేధించాలని ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ఆశా నౌటియల్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమైంది. కొంతమంది హిందువులు కాని వ్యక్తులు, మతపరమైన స్థలం పవిత్రతకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని కేదార్‌నాథ్ ఎమ్మెల్యే ఆరోపించారు. దీనిపై , ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ స్పందించారు. బీజేపీ నాయకులకు సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఆగ్రహ వ్యక్తం చేశారు.

Read Also: BYD: మార్కెట్‌లోకి 2025 బీవైడీ సీల్, అట్టో 3 .. ఫీచర్లు, ధర, రేంజ్ వివరాలు..

‘‘దార్‌నాథ్ ధామ్ పవిత్రతను దెబ్బతీసేందుకు కొంతమంది హిందూయేతర శక్తులు ప్రయత్నిస్తున్నాయి’’ అని నౌటియాల్ అన్నారు. ఈ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మాసం, చేపలు, మద్యం వడ్డిస్తు్న్నారా..? అని ప్రశ్నించిన నేపథ్యంలో, ఎమ్మెల్యే మాట్లాడుతూ సరైన దర్యాప్తు తర్వాతే ఇది తెలుస్తుందని అన్నారు. హిందూయేతరుల గురించి ఇటీవల ఇన్‌ఛార్జ్ మంత్రి సౌరభ్ బహుగుణ ఇటీవల అధికారులు, నివాసితులతో సమావేశం నిర్వహించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఎమ్మెల్యే నౌటియాల్ వ్యాక్యలపై కాంగ్రెస్ నేత హరీష్ సింగ్ రావత్ స్పందిస్తూ.. ‘‘సంచలన వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు అలవాటు. ఉత్తరాఖండ్ దేవభూమి, మీరు ఎంత కాలం ప్రతీదానిని మతంతో ముడిపెడుతారు..? ప్రజలకు చెప్పడానికి బీజేపీ వద్ద ఏమి లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నారు’’ అని అన్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 30 నుండి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది, ఆ సమయంలో గంగోత్రి, యమునోత్రి ధామాల తలుపులు తెరవబడతాయి. కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు మే 2న , బద్రీనాథ్ ధామ్ ద్వారాలు మే 4న తెరుస్తారు.