Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
- నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం
- ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
- మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈవీ ఛార్జింగ్ చేస్తుండగా ఒక్కసారిగామంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లో మంటలు బిల్డింగ్‌లోకి వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా… పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తూ పలువురిని రక్షించారు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో బుధవారం నివాస భవనంలో చెలరేగిన భారీ మంటల్లో ఇద్దరు మృతి చెందగా, సుమారు 50 కుటుంబాలు భవనంలో చిక్కుకుపోయాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి భారీ సహాయక చర్యలు చేపట్టడంతో మిగిలిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Also Read
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఫేజ్-3 పోలీస్ స్టేషన్ పరిధిలోని మమూరా గ్రామంలో ఉన్న జీ+4 నివాస భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక విచారణలో ఎలక్ట్రిక్ బైక్‌ను ఛార్జింగ్ చేస్తుండగా స్పార్క్ రావడంతో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. అనంతరం మంటలు పార్కింగ్‌లో ఉన్న పెట్రోల్ వాహనాలకు వ్యాపించి భారీ అగ్నిప్రమాదానికి దారితీశాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్‌లు, రెస్క్యూ వాహనాలు, ఏడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలో నివసిస్తున్న సుమారు 50 కుటుంబాల సభ్యులను సురక్షితంగా బయటకు తరలించారు.
గౌతమ్ బుద్ధ నగర్ జాయింట్ పోలీస్ కమిషనర్ రాజీవ్ నారాయణ్ మాట్లాడుతూ.. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉండటంతో అక్కడ చెలరేగిన మంటల నుంచి వచ్చిన దట్టమైన పొగ పై అంతస్తులకు వ్యాపించిందని తెలిపారు. పొగ పీల్చుకోవడంతో ఇద్దరి ఆరోగ్యం విషమించడంతో వారిని వెంటనే అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అనంతరం చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఈవీ ఛార్జింగ్ సమయంలో ఏర్పడిన స్పార్క్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని రాజీవ్ నారాయణ్ తెలిపారు. ఈ ఘటనపై ఫేజ్-3 పోలీస్ స్టేషన్లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, భవన యజమాని, లీజుదారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!