NTV Telugu Site icon

CAA: సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు.. స్పష్టం చేసిన అమిత్ షా..

Amit Shah

Amit Shah

CAA: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం( సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్)(సీఏఏ) అమలును ఎవరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం మమతాబెనర్జీ బుజ్జగింపు, చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింసకు పాల్పడుతోందిన ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రంలో బీజేపీని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.

Read Also: USA: ఇతర మహిళల్ని చూస్తున్నాడని.. బాయ్‌ఫ్రెండ్ కంటిని పొడిచేసిన ప్రేయసి..

ర్యాలీకి భారీకి తరలివచ్చిన ప్రజలను ప్రశంసిస్తూ.. ఇది ప్రజల ఆలోచనల్ని తెలియజేస్తుందని, 2026లో రాష్ట్రంలో మూడింట రెండొంతుల మెజారిటీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రదర్శనే బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పునాది వేస్తుందని అమిత్ షా అన్నారు.

సీఏఏ అమలును మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారని, దాన్ని ఎవరూ ఆపలేరని, కేంద్ర ప్రభుత్వం ఇంకా తన నిబంధనలను రూపొందిచనందున ఇది సందిగ్ధంలో ఉందని వెల్లడించారు. అయితే సీఏఏను కాంగ్రెస్‌తో సహా టీఎంసీ వంటి చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బెంగాల్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీ ప్రతిపక్షంగా ఉంది. 2019లో లోక్‌సభ ఎన్ని్కల్లో బీజేపీ 42 స్థానాలకు గానూ 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది.