NTV Telugu Site icon

PM Modi: నాకు ‘‘శీష్ మహల్’’ లేదు.. కేజ్రీవాల్‌పై ప్రధాని మోడీ కామెంట్స్..

Pm Mod

Pm Mod

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. ఆప్ అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి నివాసం కోసం అరవింద్ కేజ్రీవాల్ ‘‘శీష్ మహల్’’ని విలాసవంతంగా నిర్మించారు. దీనిపై ప్రధాని మోడీ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం 4 కోట్ల మందికి ఇళ్లను నిర్మించిందని, శీష్ మహల్ నిర్మించలేదని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, నగర మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేసిందని, ఆప్ పార్టీని ఆపదగా అభివర్ణించారు.

Read Also: Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి

ఢిల్లీలో మురికివాడల నివాసుల కోసం గృహ నిర్మాణ ప్రాజెక్టుని శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. ‘‘నేను శీష్ మహల్‌ని నిర్మించగలను, కానీ నా స్వప్నం నా దేశస్తులకు శాశ్వత ఇళ్లు కావాలి’’ అని అన్నారు. ఆప్ మద్యం కుంభకోణం, పాఠశాలల కుంభకోణం, కాలుష్య కుంభకోణానికి పాల్పడిందని మోడీ ఫైర్ అయ్యారు. వారు బహిరంగ అవినీతికి పాల్పడుతూనే, దానిని ప్రచారం చేస్తున్నారు. ఇది ఢిల్లీకి ఆపద అని, ఢిల్లీ ప్రజలు ఈ ఆపదకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారని అన్నారు.

Show comments