Site icon NTV Telugu

Masala Dosa: స్పెషల్ మసాలా దోశకు సాంబార్ ఇవ్వని రెస్టారెంట్.. రూ.3,500 జరిమానా

Masala Dosa

Masala Dosa

Masala Dosa: రెస్టారెంట్ల నిర్లక్ష్యం ఒక్కోసారి భారీ మూల్యానికి కూడా దారి తీయవచ్చు. బీహార్ లోని బక్సర్ కి చెందిన ఓ రెస్టారెంట్ స్పెషల్ మసాలా దోశకు సాంబార్ ఇవ్వనుందకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. లాయర్ మనీష్ గుప్తా గత ఆగస్టులో తన పుట్టిన రోజు సందర్భంగా ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒక రెస్టారెంట్ నుంచి రూ.140 విలువైన మసాలా దోశను ఆర్డర్ చేశాడు. అయితే దోశతో పాటు సాంబార్ ఇవ్వలేదు సదరు రెస్టారెంట్.

దీంతో కస్టమర్ రెస్టారెంట్ ను ఏకంగా కోర్టుకు లాగాడు. కోర్టు రెస్టారెంట్ కు రూ.3,500 జరిమానా విధించింది. పిటిషనర్‌కు సాంబార్ నిరాకరించడం వల్ల కలిగే మానసిక, ఆర్థిక, శారీరక బాధను కోర్టు గుర్తించింది. జరిమానా చెల్లించేందుకు నమక్ రెస్టారెంట్‌కు 45 రోజుల గడువు ఇచ్చింది. రెస్టారెంట్ అలా చేయడంలో విఫలమైతే, జరిమానా మొత్తంపై 8 శాతం వడ్డీ వసూలు చేయబడుతుందని తీర్పు చెప్పింది.

Read Also: Hand Chopping Case: కేరళ ప్రొఫెసర్ చేతిని నరికేసిన కేసులో ముగ్గురికి జీవిత ఖైదు..

2022, ఆగస్టు 15న న్యాయవాది మనీష్ గుప్తా తన పుట్టినరోజున మసాలా దోశ ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకుని, బక్సర్ లోని నమక్ రెస్టారెంట్ కి వెళ్లాడు. రూ. 140 తో స్పెషల్ మసాలా దోశ ఆర్డర్ చేశాడు. అయితే సాధారణంగా దోశను సాంబార్, చట్నీతో ఇస్తారు. కానీ మనీష్ ఆర్డర్ లో సాంబార్ రాలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే, రెస్టారెంట్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది.‘‘రూ.140తో రెస్టారెంట్ మొత్తాన్ని కొంటారా..?’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

మనీష్ రెస్టారెంట్‌కు లీగల్ నోటీసును అందించాడు. యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. 11 నెలల తర్వాత, వినియోగదారుల కమిషన్ ఛైర్మన్ వేద్ ప్రకాష్ సింగ్ మరియు సభ్యుడు వరుణ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ రెస్టారెంట్‌ను దోషిగా నిర్ధారించి, రూ. 3,500 జరిమానా విధించింది.

Exit mobile version