Site icon NTV Telugu

Rekha Gupta: కాల్పుల విరమణపై కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు

Rekhagupta

Rekhagupta

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ కాల్పుల విరమణ ప్రకటించాయి. భారత్ కాల్పుల విరమణ ప్రకటించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆప్ ఆరోపించింది. అయితే ఇదే అంశంపై బుధవారం ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు. జాతీయ భద్రతపై కేంద్రాన్ని గానీ, సాయుధ బలగాలను గానీ ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని ఎవరైనా ఎన్నైనా చెప్పొచ్చని.. కానీ దేశం గురించి, 140 కోట్ల ప్రజల గురించి ఆలోచించేవారు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. కేవలం విమర్శించడానికే మాట్లాడేవారితో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

ఇది కూడా చదవండి: Veeraiah Chowdary Incident: టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించిన పోలీసులు.

కాల్పుల విరమణ తర్వాత మాజీ ముఖ్యమంత్రి అతిషి ఎక్స్‌లో కీలక పోస్టు చేశారు. పహల్గామ్ ఉగ్రవాదుల్ని పట్టుకున్నారా లేదా అనే విషయాన్ని దేశం తెలుసుకోవాలనుకుంటోందని చెప్పారు. అంతకముందు ఆపరేషన్ సిందూర్ ద్వారా బలగాలు తమ ధైర్యాన్ని చాటిచెప్పాయని పేర్కొన్నారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. అకస్మాత్తుగా కాల్పుల విరమణ ప్రకటన వెనుక ఏం మతలబు జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: MP Vallabhaneni Balasouri: జనసేన ఎంపీకి లోక్‌సభలో కీలక పోస్టు..

 

Exit mobile version