NTV Telugu Site icon

Bangladesh: ‘‘భారతీయ హిందువు మా దేశం ఎందుకు వచ్చావురా..?’’ యువకుడికి బంగ్లాదేశ్‌లో దాడి..

Bangladesh

Bangladesh

Bangladesh: స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన భారతీయ యువకుడికి బంగ్లాదేశ్‌లో చేదు అనుభవం ఎదురైంది. భారతదేశానికి చెందిన వ్యక్తి కావడంతో అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్‌లోని బెల్ఘరియా నివాసి సయన్ ఘోష్ తన స్నేహితుడిని కలిసేందుకు నవంబర్ 23న ఢాకా వెళ్లాడు. అయితే, నవంబర్ 26న తిరిగి భారతదేశానికి వచ్చే సమయంలో ఆయన దాడికి గురయ్యాడు.

21 ఏళ్ల యువకుడు సయన్ ఘోష్ ఢాకాలోని బగన్‌బరీ ప్రాంతంలో తన స్నేహితుడితో కలిసి ఐస్‌క్రీమ్ తింటుండగా, అక్కడికి చేరుకున్న గుంపు అతడి గుర్తింపు, దేశం, మతం అడిగి దాడికి పాల్పడ్డారు. తాను ఇండియాకు చెందిన వాడనిని హిందువు అని చెప్పడంతో దాడి మొదలైంది. మతోన్మాద మూక సయన్‌ని రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి నా పర్సు, డబ్బు, మొబైల్ ఫోన్ లాక్కెళ్లారని, కత్తితో రాళ్లతో దాడి చేశారు. తన స్నేహితుడిపై దాడిని అపేందుకు ప్రయత్నించిన ఆ దేశానికి చెందిన వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డారు.

Read Also: Syria Crisis: సంక్షోభం దిశగా సిరియా.. రష్యా ఆదుకునేనా.. రెబల్స్ దూకుడు..

‘‘ఒక భారతీయ హిందువు మా దేశానికి ఎందుకు వచ్చాడు..?’’ అని దాడికి పాల్పడ్డారు. చుట్టుపక్కల జనాలు కూడా సాయం చేయలేదు. స్థానిక అధికారులు కూడా తనకు సాయం చేయలేదని ఘోష్ అన్నారు. తాను బంగ్లాదేశ్‌ ఎమర్జెన్సీ నంబర్‌కి కాల్ చేశానని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు బదులుగా తనపైనే ఆరోపణలు చేసినట్లు ఘోష్ చెప్పాడు. ఘటన జరిగిన తర్వాతి రోజు కొంతమంది స్థానికులు తన స్నేహితుడి ఇంటికి వచ్చి మరొసారి వచ్చి బెదిరించారని చెప్పాడు. భారతీయ హిందువులు ఎవరూ బంగ్లాదేశ్ వెళ్లొద్దని, సురక్షితం కాదని చెప్పాడు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత అక్కడ మైనారిటీలను ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ మతోన్మాద మూక దాడులకు పాల్పడుతున్నారు.