Site icon NTV Telugu

Government Benefits: నలుగురికి కన్నా ఎక్కువ సంతానం ఉంటే ప్రభుత్వ పథకాలు కట్.. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

Manipur

Manipur

No Government Benefits For Families With More Than 4 Children In Manipur: మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నలుగురు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం గురువారం మణిపూర్ స్టేట్ పాపులేషన్ కమిషన్ ఏర్పాటు కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్ఢినెన్స్ లో నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ఎటువంటి ప్రభుత్వ ప్రయోజనాలు అందిచకూడదని నిర్ణయించుకుంది.

మణిపూర్ స్టేట్ పాపులేషన్ కమిషన్ కింద..ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత ఏదైనా జంటకు నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే కుటుంబంలోని ఏ వ్యక్తికి కూడా ప్రభుత్వ ప్రయోజనాలు అందించబడవు. రాష్ట్రంలో జనాభా కమిషన్ ఏర్పాటు చేయాలని గతంలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ప్రైవేట్ తీర్మాణాన్ని ఆమోదించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మణిపూర్ రాష్ట్రంలో మొత్తం 28.56 లక్షల మంది ఉన్నారు. 2001లో ఇది 22.93 లక్షలుగా ఉంది.

Read Also: Vande Bharat Express: నవంబర్ 10న ఐదో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం.. దక్షిణాదికి తొలి రైలు

అంతకుముందు అస్సాం రాష్ట్రం జనవరి 1, 2021 తర్వాత ఇద్దరు పిల్లలు కంటే ఎక్కవ మంది సంతానం ఉంటే ఆ వ్యక్తిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఖుముక్చమ్ జోయ్ కిసాన్ రాష్ట్రంలోకి బయటి వ్యక్తుల చొరబాట్లు తీవ్రం కావడంతో ఈ తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. అధికారిక డేటా ప్రకారం..1971-2001 నుంచి మణిపూర్ కొండ ప్రాంత జిల్లాల్లో 153.3 శాతం జనాభా పెరిగింది. 2001-2011 మధ్య కాలంలో ఇది 250 శాతంగా ఉంది.

Exit mobile version